Manoj Madhavi Shedlo Mucchatlu ఓ కొత్త స్టొరీ షెడ్ లో saradalu, పాత పేపర్లు కొనే కొట్టులో పనివాడు, యజమాని కూతురుతో రోమాన్స్ ప్రయత్నం ఎలా సాగింది?
Manoj Madhavi Shedlo Mucchatlu
పట్టణం చివర్లో ఉన్న ఆ చిన్న చిత్తు కాగితాల కొట్టు ఎప్పుడూ పాత పుస్తకాల వాసనతో నిండిపోయి ఉండేది. బయటకు చూస్తే అది సాధారణ షెడ్‌లా కనిపించినా… లోపల మాత్రం పాత కథలు, చినిగిన పేజీలు, మరచిపోయిన జ్ఞాపకాల ప్రపంచంలా ఉండేది.
ఆ కొట్టు యజమాని రామయ్య.
నిజాయితీగా బ్రతికే మనిషి.
అతనికి ఒక్కగానొక్క కూతురు — మాధవి.
మాధవి చాలా సింపుల్.
చిన్న జడ, ముదురు చుడీదార్, కళ్లలో ప్రశాంతత.
అతిగా మాట్లాడదు… కానీ మాట్లాడితే వినాలనిపించే స్వరం.
ఒక మధ్యాహ్నం…
ఎండ మండిపోతుండగా ఒక యువకుడు షెడ్ ముందు ఆగాడు.
చేతిలో చిన్న బ్యాగ్, ముఖంలో అలసట.
“అన్నా… పని ఏదైనా ఉంటే చెయ్యాలనుకుంటున్నాను,” అన్నాడు.
రామయ్య అతన్ని పై నుంచి కింద వరకు చూసాడు.
“పేరు?”
“మనోజ్.”
“ఏం పని చేయగలవు?”
“ఏదైనా చేస్తాను అన్నా… బరువులు మోస్తాను, పుస్తకాలు సర్దుతాను… ఖాళీగా ఉండలేను.”
రామయ్య కొద్దిసేపు ఆలోచించాడు.
షెడ్‌లో పని చేసే వాళ్లు అప్పుడప్పుడు మారిపోతూ ఉండేవారు.
“సరే… రెండు రోజులు చూద్దాం. నచ్చితే ఉండు.”

మనోజ్ కళ్లలో వెలుగు మెరిసింది.
“ధన్యవాదాలు అన్నా.”
అప్పుడే లోపల నుండి మాధవి వచ్చింది.
చేతిలో టీ గ్లాసులు.
“నాన్న… టీ.”
ఆమె చూపు క్షణం మనోజ్ మీద పడింది.
మనోజ్ మాత్రం ఆమెను చూసి కాసేపు మాట మరిచిపోయాడు.
మనోజు మనసులో మాధవికి దగ్గరగా, షెడ్ లో ఒంటరిగా సరసాలు ఊహ చేస్తున్నాడు
ఆ సాధారణ రూపంలో ఏదో ప్రశాంతమైన అందం ఉంది.
“ఇతను కొత్తగా పనికి వచ్చాడు,” అన్నాడు రామయ్య.
మాధవి చిన్నగా తల ఊపింది.
“సరే.” Manoj Madhavi Shedlo Mucchatlu అని మనసులో అనుకుంది
ఆ రోజు నుండి మనోజ్ షెడ్‌లో పని చేయడం మొదలుపెట్టాడు.
పాత పుస్తకాల గుట్టలు సర్దుతూ…
చిత్తు కాగితాలు తూస్తూ…
మధ్య మధ్యలో మాధవి మాట్లాడే ఒక్కో మాట కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు.
ఆమె నవ్వితే అతనికి ఆ రోజు పని తేలికగా అనిపించేది.
ఆమె రాకపోతే షెడ్ ఖాళీగా అనిపించేది.
నెమ్మదిగా…
మనోజ్ మనసులో మాధవిపై ఇష్టం పెరగడం మొదలైంది.
మనోజ్ కు ఎలాగైనా ఆమెతో మాట్లాడాడని ట్రై చేస్తున్నాడు… కానీ కుదరడం లేదు… ఎవరో కస్టమర్లు వస్తూ ఉండడం…
కూతురు మాధవి కౌంటర్ దగ్గర చిన్న స్టూల్ మీద కూర్చుని ఖాతాలు రాస్తోంది. అప్పుడే ఎదో చిత్తు కాగితాల గుట్ట ఒక్కటి కనబడింది… అందులో పాత నవలలు ఉన్నాయి.
అందులోని నవలలను బయటకు తీస్తూ ఒక్కోటి చూస్తున్నాడు.
అక్కడికి అప్పుడే ఎవరో కస్టమర్ వచ్చాడు…
వచ్చి “మా దగ్గర పాత పుస్తకాలూ చాలా ఉన్నాయి, ఎవరైనా వస్తారా” అన్నాడు
వెంటనే రామయ్య, తన కూతురితో
“చూడమ్మా అతను కొత్త కుర్రాడు కదా
నేనే వెళ్లి వస్తాను, కొట్టు చూసుకో” అన్నాడు
“అలాగే నాన్న” అంటూ తల ఊపింది.
రామయ్య కస్టమర్ తో బయటకు వెళ్ళాడు..

మనోజ్ పుస్తకాలను చూడడం గమనించిన మాధవి
“ఓయ్… ఏం చేస్తున్నావ్” అంది
“చూస్తున్నా” అన్నాడు మనసులో Manoj Madhavi Shedlo Mucchatlu భలే
“ఏమిటి” అంది
“ఇవి మేడం” అన్నాడు
“ఇవి అంటే?”
“అతడు ఆమెను జయించాడు” అని ఒక పుస్తకం పేరు గట్టిగా చదివాడు.
మాధవి తలెత్తి ఒకసారి చూసింది.
“ఏమిటి?” అంటూ ప్రశ్నార్ధకంగా చూసింది,
“పుస్తకం టైటిల్” అన్నాడు,
“ఓహ్” అని ఆమె తన పనిలో నిమగ్నం అయ్యింది
మనోజ్ ఇంకో పుస్తకం తీసుకున్నాడు.
“వెన్నెల్లో ఆడపిల్ల” అన్నాడు కొంచెం నెమ్మదిగా.
మాధవి పెన్ను ఆపి అతని వైపు చూసింది.
“చూడు, అదిగో అక్కడ, అసమర్థుని జీవయాత్ర…ఉంది” అంది
మనోజ్ చిన్నగా నవ్వాడు.
“పాత పుస్తకాల టైటిల్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి అమ్మా.”
అతను మళ్లీ మరో పుస్తకం తీసుకున్నాడు.
“ప్రేమించండి ప్లీజ్….” అని ఈసారి మరింత స్పష్టంగా చదివాడు.
మాధవి మరింత సీరియస్ గా చూస్తూ.

“పని చూసుకో”
“కవ్వించకే మనసా….” అన్నాడు మనోజ్ ఆమె వైపు చూడకుండా.
మాధవి ఖాతా పుస్తకం మూసేసింది.
“ఏమిటి? ఆ పాత పుస్తకాల పేర్లు పట్టుకుని” అన్నది
“టైటిల్స్ బాగున్నాయ్” Manoj Madhavi Shedlo Mucchatlu
“సారీ రాంగ్ నెంబర్” అంటూ ఆమె దగ్గరికి వచ్చి ఒక పుస్తకం తీసుకుంది.
“‘స్మయిల్ ప్లీజ్…” అంటూ ఇంకో పుస్తకం తీశాడు
మనోజ్ ఆమె చేతిలోని పుస్తకాన్ని చూసి, మాధవి కళ్లలోకి చూస్తూ అన్నాడు—
“కలగంటినే చెలీ” అన్నాడు
మాధవి కాసేపు నిశ్శబ్దంగా చూసింది.
“నాకు నువ్వు, నీకు నేను” అంటూ
మనోజ్ చిన్నగా నవ్వాడు.
“చెప్పుతో కొడతా” అంది మెల్లగా
ఆమెతో మాట్లాడడమే కావాలి, ఎదో
విధంగా మాట్లాడాను అనుకున్నాడు
“ఏమిటి? పుస్తకాల పేర్లు చదివేసి,
చనువు పెంచుకుంటున్నావ్…” అంది
“ఏం లేదు మేడం, మీరు బాగున్నారు
అది చెప్పడానికి చనువు కావాలి కదా” అన్నాడు
“దానికి చనువు ఎందుకు, బాగున్నాను కదా” అంది
“లేదు” అన్నాడు
“ఏయ్ ఎక్కువ చేయకు” సీరియస్ ముఖం
“నా బొంద, ఎంత ఎక్కువ చేసినా
నీ అందం ముందు తక్కువే” అన్నాడు
“ఒరేయ్… నీవు పని చేరింది, ఎప్పుడు?
నాతొ ఏంట్రా? నీకు” అంది
“మేడం…. అలా అనొద్దు… నీతోనే నేను” అన్నాడు
“వేషాలు వేయకు” అంది
“వేషాలు కాదు, నిజం నేను చాన్నాళ్ళ నుండి చూస్తున్నా”
“ఏమిటి నువ్వు చూసేది?
మా నాన్న రాని, నీ పని చెప్తా” అంది
వెంటనే అతను ఆమెని బ్రతిమాలుడుతూ
“అలా కాదు, ప్లీజ్ ఆ పని మాత్రం చెయ్యొద్దు” అన్నాడు
మరుసటి రోజు సాయంత్రం షెడ్ దగ్గర నిశ్శబ్దం ఎక్కువగా ఉంది.
రామయ్య ఏదో పని మీద బయటకు వెళ్లిపోయాడు.
షెడ్‌లో మనోజ్, మాధవి ఇద్దరే ఉన్నారు.
పాత కాగితాల గుట్టల మధ్యగా సూర్యకాంతి లోపలికి పడుతోంది, కాని అది తగ్గుతూ మబ్బులు రావడానికి సిద్దంగా ఆకాశం.
ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతూ “కిర్… కిర్…” అనే శబ్దం చేస్తోంది.
మనోజ్ పుస్తకాలు సర్దుతున్నాడు… కానీ చూపులు మాత్రం అప్పుడప్పుడూ మాధవి వైపే వెళ్తున్నాయి.
మాధవి కౌంటర్ దగ్గర ఖాతాలు రాస్తోంది.
ఇద్దరి మధ్య నిశ్శబ్దం పెరుగుతుండటంతో మనోజ్ చివరకు ధైర్యం చేసి మాట్లాడాడు.
“మీకు పుస్తకాలు చదవడం ఇష్టమా?”
మాధవి తలెత్తి చూసింది.
“అప్పుడప్పుడు చదువుతాను. ఎందుకు?”
మనోజ్ దగ్గరలో ఉన్న పాత నవల తీసుకున్నాడు.
“ఇవి చూస్తుంటే… పాత ప్రేమకథలు చాలా ఉంటున్నాయి.”
మాధవి చిన్నగా నవ్వింది.
“చిత్తులో ఎక్కువగా అవే వస్తాయి.”

“ఎందుకో తెలుసా?” అన్నాడు మనోజ్.
“ఎందుకు?”
“ప్రేమ ముగిసిన తర్వాత… జ్ఞాపకాలు కూడా పాత కాగితాల్లా అమ్మేస్తారేమో.”
మాధవి పెన్ను ఆపి అతని వైపు చూసింది.
“ఏరా…. నాతొ పులిహోర కలపడం అపు” అంది.
మనోజ్ నవ్వుకున్నాడు.
“కోప్పడకండి మేడం”
కొద్దిసేపు మళ్లీ నిశ్శబ్దం.
బయట గాలి వీచి కొన్ని పేజీలు ఎగిరిపోయాయి.
మాధవి వాటిని పట్టుకోడానికి వెళ్లగా, ఒకేసారి మనోజ్ కూడా ముందుకు వచ్చాడు.

ఇద్దరి చేతులు ఒకే పుస్తకం మీద తగిలాయి.
మాధవి వెంటనే చేయి వెనక్కి తీసుకుంది.
“మాధవిని ముట్టుకుంటావా?” అంటూ చెంపమీద కొట్టింది
ఆమె కళ్లలోకి చూస్తూ మెల్లగా అన్నాడు—
“మీరు నవ్వితే… ఈ షెడ్ కూడా కొత్తగా కనిపిస్తుంది.”
“చూడు, నాతొ అసలు మాట్లాడకు, పో” అంది.
కాసేపటికి వర్షం స్టార్ట్ అయ్యింది.
మబ్బులు గమనించని వారిలో హడావుడి మొదలైంది..
“ఒరేయ్ పేపర్లు తడుస్తున్నాయ్… షెడ్ లో వేసేయ్
గబా గబా లోపలికి లాగు” అంటూ హడావుడి పెట్టింది.
మనోజ్ పేపర్ కట్టలన్ని షెడ్ లోపల పెట్టేయడంతో
షెడ్ ఖాళి లేకుండా ఉంది. దాంతో
ఇద్దరూ ఇరుకుగా అనుకుని దగ్గర కూర్చుని ఉన్నారు