Shapu yajamanito kala kanna

Shapu yajamanito kala kanna kanneపిల్ల ఓ టౌన్ లో ఓ షాపు ఆ షాపులో యజమాని, ఆ షాపులో పని చేసే అమ్మాయి… కథాలయంkathayalamలో

Shapu yajamanito kala kanna

“ఏమిటి? ఇంతలేటు”

“రాత్రి లేటు అయ్యింది కదా”

“రాత్రి లేటు అయితే, ఉదయం లేటుగా వస్తవా?” సీరియస్ గా అన్నాడు.

“సార్, అది కాదు పుద్దుటే లేచేటప్పటికి లేటు అయ్యింది”

“రాత్రి ఏం ఘనకార్యం చేసావు” అన్నాడు.

“ఏం లేదు సార్” అంది.

“మరి ఎందుకు లేట్?”

“ఈసారి లేటుగా వస్తే, ఒళ్ళు హూనం అవుతుంది” అప్పుడప్పుడు ఓనర్ అలా కోప్పడడం ఆలవాటే, ఆమెకు.

షాపులోకి కస్టమర్ వచ్చాడు

“ఏం కావాలి?” ప్రశ్న వేసింది,

“చూపించండి” చెబుతా అన్నాడు

“రండి, లోపలకి, బయట చూపించడం కుదరదు” అని ఆమె లోపలికి వెళ్ళింది

“చూపించండి”

“ఆమె బట్టలు తీసి, అతనికెదురుగా”

“చూడండి” అంది

“ఇవేనా…?”

“ఇంకా ఉన్నాయ్, చూడండి” అంటూ ఇంకా బట్టలు తీసింది

Shapu yajamanito kala kanna
Shapu yajamanito kala kanna

ఈసారి అతను కళ్ళు మెరిసాయి

తర్వాత ఆమెతో “ఒక్క విషయం” అన్నాడు మెల్లగా

“చెప్పండి”

“ఏం లేదు” అంటూ ఆమెకు వినపడేలా

“ఇన్నర్ వేర్” అన్నాడు…

“ఓహ్ అలాగే” అంటూ మెన్స్ ఇన్నర్ వేర్ చూపించింది..

అతను సిగ్గుగా ఉండడం చూసి

“ఏంటండి సిగ్గు, ఏం కావాలో తీసుకునేదానికి” అనేసింది..

అతను అవి తీసుకుని బయటకు పోయాడు. అలా

రకరకాల కస్టమర్లతో ఆమె, నొప్పించకుండా మాట్లాడుతూ

బట్టలు అమ్ముతూ ఉంటుంది.

అందుకే ఆ షాపు యజమానికి ఆమె ఇష్టమే

కాని అప్పుడప్పుడు కోపం చూపిస్తూ ఉంటాడు.

“సార్.. ఇంకా షాపు మూయలేదు?”
అమ్మాయి బిల్లు పుస్తకాన్ని మూసేస్తూ అడిగింది.

యజమాని నవ్వాడు.
“కస్టమర్లు వస్తారేమో చూద్దాం”

ఆమె కాసేపు ఆశ్చర్యంగా చూసింది.
“చాలా రాత్రి అయ్యింది కదా.”

“రాత్రి అయ్యింది, డబ్బులు రావాలి కదా?”
అతని మాటల్లో కఠినత్వం ఉంది.

ఆమె తలదించుకుంది.
“సరే కట్టేద్దాం లే” అన్నాడు

ఇంతలోనే జోరుగా

వర్షం పడడం ప్రారంభం అయ్యింది.
లోపల ట్యూబ్‌లైట్ వెలుగు మాత్రమే.
రాక్స్ మధ్య నిశ్శబ్దం.

యజమాని కౌంటర్‌పై చేతులు పెట్టి ఆమెవైపు చూశాడు.
“ఇప్పుడు కట్టేయనా?” అన్నాడు

“అయ్యో ఎలా? వర్షం వస్తుంది”

“సర్లే, కాసేపు కూర్చో”

ఆమె పెదవులపై చిన్న నవ్వు మెరిసింది.
“సార్, మీరు లవ్ చేసారా?.” అనగానే, అతను ఆశ్చర్యంగా

“లేదు, మరి ఇంతకాలం ఒంటరిగా…”

ఆమె బిల్లుల కట్టను సర్దుతూ మెల్లగా అడిగింది—
“అంటే… అప్పుడప్పుడు అలా వెళ్తాను?”

 “ఎలా? ఎందుకు” అంది.

ఆమె గుండె వేగంగా కొట్టుకుంది.
హటాత్తుగా అనుకోని మాటర్ లోకి ఎందుకు వెళ్లినట్టు?.

“సార్…” అని ఆగింది… Shapu yajamanito kala kanna

అతను చిరునవ్వు నవ్వాడు.
ఆమె మొదటిసారి అతని కళ్లలోకి నేరుగా చూసింది.

ఆ నిశ్శబ్దంలో…
వర్షం శబ్దం మాత్రమే వినిపిస్తోంది.

అతను ప్రశాంతంగా ఆమెవైపు చూశాడు.
“ఎందుకంటే సరదాగా మాట్లాడటం లేదు.”

ఆమె చిరునవ్వు నవ్వింది.
“అయితే మీ ఉద్దేశ్యం ఏమిటో నాకు అర్థమవుతోంది.”

“అర్థమైతే… నువ్వేం అనుకుంటున్నావు?”

ఆమె కొద్దిసేపు మౌనంగా నిలబడి ర్యాక్‌పై వేళ్లతో గీతలు గీసింది.
“ఒక అమ్మాయి ప్రతిరోజూ ఎదురుగా కనిపిస్తుంటే… ఆమె గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలవుతుంది. ఆమె నవ్వితే బాగుంటుంది అనిపిస్తుంది. ఆలస్యంగా వస్తే ఎదురుచూస్తారు. ఇదే కదా?”

అతను మెల్లగా నవ్వాడు.
“అంతే కాదు.”

ఆమె కనుబొమ్మలు పైకెత్తింది.
“మరేం ఉంది?”

“నువ్వు వెళ్లిపోయాక ఈ షాప్ ఖాళీగా అనిపిస్తుంది. నువ్వు మాట్లాడకపోతే రోజు నిస్సారంగా ఉంటుంది. నువ్వు నవ్వితే… కారణం లేకపోయినా నాకు సంతోషం వస్తుంది.”

ఆమె అతని మాటలు శ్రద్ధగా విన్నది.

“సార్… ఇవన్నీ చెప్పడం వల్ల తర్వాత పరిస్థితులు మారిపోవచ్చు తెలుసా?”

“తెలుసు.”

“అయినా చెబుతున్నారా?”

అతను ఈసారి నేరుగా చెప్పేశాడు.

“అవును. ఎందుకంటే నేను నిన్ను కేవలం ఉద్యోగిగా చూడడం లేదు.”

ఆమె గుండెలో ఒక్కసారిగా అలజడి పుట్టింది.
అయినా బయటకు మాత్రం ప్రశాంతంగానే కనిపించింది.

“అంటే…?”

ఆ మాట షాప్ నిశ్శబ్దంలో స్పష్టంగా వినిపించింది.

ఆమె కాసేపు అతని కళ్లలోకి చూసింది.
తర్వాత మెల్లగా అడిగింది—

“మరి మొహమాటం లేకుండా, మీరు ఎవరితోనో ఎక్కడో మాట్లాడినట్టు మాట్లాడితే ఎలా?”

అతను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు.

“సరే” Shapu yajamanito kala kanna

ఆమె పెదవులపై చిన్న నవ్వు వచ్చింది.
“ఒక్కసారి ట్రై చేద్దాం… నేను ఎక్కడికి వెళ్తానో, అక్కడ ఎలా ఉంటానో”

అనగానే ఆమె “సార్…” అంది..

అతను ఆలోచన చేయకుండా మాటలు మొదలు పెట్టాడు.

ఆమె అతనివైపు చూసింది.

“ఏమిటి?నా మనసులో అనుకున్నాయ్ ఎలా తెలుసు?”

“నీకు స్పృహ తెలియడం లేదా, నీవు అన్ని పైకే మాట్లాడావ్” అన్నాడు..

ఆమె నాలుక్కరుచుకుంది.

“రేపటి నుండి.. షాపుకి రాకు” ఆ మాటతో ఉలిక్కిపడి లేచింది…

“ఇలా నిద్రపోతూ ఉంటే, నా షాపుకు దరిద్రం పట్టుకుంటుంది” అనడంతో

“సార్ … సార్ సారి” అంది…

yuvakudu musalodu yuvati katha

rudrasenudu musalivadila maroka yuvatito

kathalayam ekkada eppudu puttindi?

Yuvaraju viluva Oka Chellani Nanem

https://cinemasandadi.com

https://techsangati.com

Leave a Comment