ఓ కల్పిత కథ, తనకే అన్ని తెలుసు అనే భావన పండితుడునీ సైతం పడగొడుతుంది. ఇంకా నోటి దూల కూడా ఉంటే మరి అలాంటి ఒక వ్యక్తి కల్పిత కథ మాత్రమే ఎవరిని ఉద్దేశిస్తూ రాయడం లేదు.
నాగేశ్వర్ నోటి దూలతో పరువు పోగొట్టుకున్న పండితుడు కథలోకి
ఒకసారి నాగేశ్వర్ తన కార్యాలయంలో కూర్చొని కొన్ని గణిత సమస్యలు పరిశీలిస్తున్నాడు. అతని దగ్గర పనిచేసే అమ్మాయి సరోజ లెక్కలు రాస్తూ ఉంది.
అప్పుడే గ్రామానికి చెందిన ఓ యువతి ఏదో పని మీద అక్కడికి వచ్చింది.
ఆమె వెళ్లిపోయిన తర్వాత నాగేశ్వర్ చిరునవ్వుతో,
“ఇప్పటి అమ్మాయిలు కూడా భలే ఉంటారు. కొంచెం అందంగా ఉన్నామనుకుంటే చాలు, అందరూ తమనే చూస్తున్నారని అనుకుంటారు,” అన్నాడు.
సరోజ వెంటనే తల ఎత్తి చూసింది.
“సార్, మీరు అలా అనడం సరైనది కాదు కదా?” అంది.
“ఏమైంది? నేను నిజమే చెప్పాను. అందులో తప్పేముంది?” అన్నాడు నాగేశ్వర్.
“మీరు సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తి. మీ మాటలను చాలా మంది నమ్ముతారు. అలాంటి మీరు ఒక అమ్మాయి గురించి ఆమె లేని చోట ఇలా మాట్లాడితే, విన్నవాళ్లు అదే నిజమని అనుకుంటారు.”
నాగేశ్వర్ కొంచెం అసహనంగా,
“అంటే ఇప్పుడు నేను మాట్లాడకూడదా? చిన్న విషయం చెప్పినా పెద్ద సమస్య చేస్తున్నారే!” అన్నాడు.
సరోజ నెమ్మదిగా,
“సమస్య మీ మాటల్లో కాకపోవచ్చు సార్… కానీ ఆ మాటలు ఎవరిని గురించి చెప్పారో, వాళ్లకు ఎలా అనిపిస్తుందో కూడా ఆలోచించాలి.”
నాగేశ్వర్ నవ్వుతూ,
“ఇదిగో చూడమ్మా… ఇప్పుడు గ్రామంలో అందరూ నన్నే తప్పు పట్టుతున్నారు. అసలు తప్పు వాళ్లది. నేను ఒక మాట అన్నాను. దాన్ని పది మందికి చెప్పి, వంద రకాలుగా మార్చి ప్రచారం చేసిన వాళ్లదే తప్పు.”
సరోజ కాసేపు ఆలోచించి,
“అది నిజమే సార్. ఒక మాటను వక్రీకరించి ప్రచారం చేయడం కూడా తప్పే. కానీ ఆ ప్రచారానికి అవకాశం ఇచ్చిన మొదటి మాట ఎవరు అన్నారు?”
నాగేశ్వర్ మౌనంగా ఆమె వైపు చూశాడు.
“ఒక చిన్ని నిప్పురవ్వ వల్లే పెద్ద అగ్ని ప్రమాదం జరుగుతుంది. అగ్ని వ్యాపించిన వాళ్లు తప్పు చేసినట్టే, మొదట నిప్పురవ్వ పడేలా చేసినవాళ్ల బాధ్యత కూడా ఉంటుంది కదా సార్?” అంది సరోజ.
ఆ మాటలు విన్న నాగేశ్వర్ ముఖంలో ఉన్న ధైర్యం క్రమంగా తగ్గింది.
ఇంతకాలం తాను “నన్ను అపార్థం చేసుకున్నారు” అని మాత్రమే ఆలోచించాడు. కానీ “నేను చెప్పిన మాట సరైనదేనా?” అని తనను తాను ప్రశ్నించుకోలేదు.
సరోజ మళ్లీ లెక్కల పుస్తకం వైపు చూసి పని మొదలుపెట్టింది.
కానీ నాగేశ్వర్ మాత్రం తన ముందున్న గణిత సూత్రాల కన్నా, జీవితంలో చేసిన ఒక చిన్న పొరపాటు గురించే ఎక్కువగా ఆలోచిస్తూ కూర్చున్నాడు.
ఎందుకంటే గణితంలో తప్పు లెక్కను చెరిపేసి మళ్లీ రాయొచ్చు… కానీ మనుషుల మనసుల్లో పడిన తప్పు మాటను అంత సులభంగా చెరిపేయలేం.
సరోజ చెప్పిన మాటలు నాగేశ్వర్‌ను ఆ రోజు కాసేపు ఆలోచింపజేశాయి. కానీ ఆ ఆలోచన ఎక్కువసేపు నిలవలేదు.
కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న కారణం చూపించి సరోజను పనిలోంచి తీసేశాడు.
“నాతో వాదించే వాళ్లు నాకు అవసరం లేదు. నేను చెప్పింది చేసే వాళ్లు చాలు,” అని తనకు తానే అనుకున్నాడు.
ఆమె స్థానంలో కొత్తగా ఓ యువతిని పనిలో పెట్టుకున్నాడు. ఆమె పేరు మేఘనా.
మేఘనా చదువుకున్న అమ్మాయి. కానీ కొత్త ఉద్యోగం కావడంతో మొదట్లో చాలా మౌనంగా ఉండేది. నాగేశ్వర్ చెప్పిన పని చేసేది, లెక్కలు రాసేది, అవసరమైతే మాత్రమే మాట్లాడేది.
ఇదే నాగేశ్వర్‌కు నచ్చింది.
“ఇలా ఉండాలి ఉద్యోగి అంటే. అనవసర సలహాలు ఇవ్వకుండా పని చూసుకోవాలి,” అని ఒకసారి తన స్నేహితుడితో కూడా చెప్పాడు.
కానీ రోజులు గడిచే కొద్దీ మేఘనా కొన్ని విషయాలు గమనించింది.
కార్యాలయానికి వచ్చే మహిళల గురించి నాగేశ్వర్ అప్పుడప్పుడు వ్యాఖ్యలు చేయడం, వాళ్ల వ్యక్తిగత విషయాలు చర్చించడం, తన అభిప్రాయాలనే నిజం అన్నట్టు మాట్లాడడం ఆమెకు కనిపించసాగాయి.
ఒక రోజు ఇద్దరు వ్యక్తులు నాగేశ్వర్‌ను కలవడానికి వచ్చారు.
వాళ్లు వెళ్లిపోయిన తర్వాత నాగేశ్వర్ నవ్వుతూ,
“వాళ్ల ఇంటి విషయాలు మొత్తం నాకు తెలుసు. బయట ఎంత మంచివాళ్లలా నటించినా అసలు సంగతులు వేరే,” అన్నాడు.
మేఘనా ఏమీ మాట్లాడలేదు.
కానీ ఆ మాట ఆమెకు నచ్చలేదు.
మరో రోజు గ్రామంలోని ఒక మహిళ గురించి నాగేశ్వర్ వ్యాఖ్యానించాడు.
అప్పుడు మేఘనా నెమ్మదిగా అడిగింది.
“సార్, వాళ్ల గురించి మీరు చెప్పింది నిజమే అని మీకు ఖచ్చితంగా తెలుసా?”
నాగేశ్వర్ ముఖం వెంటనే మారిపోయింది.
“ఏంటి? నువ్వూ ఇప్పుడు సరోజలాగే మొదలుపెట్టావా?”
మేఘనా ఆశ్చర్యంగా చూసింది.
“నేను కేవలం అడిగాను అంతే.”
“నాకు ఎవరూ బోధించాల్సిన అవసరం లేదు. ఈ ఊరిలో నేను ఎవరినో తెలుసా?” అని కొంచెం గట్టిగానే అన్నాడు నాగేశ్వర్.
మేఘనా మౌనంగా తన పని చూసుకుంది.
కానీ ఆ రోజు ఆమె ఒక విషయం అర్థం చేసుకుంది.
సరోజను తీసేయడానికి కారణం పని కాదు.
నాగేశ్వర్‌కు తన తప్పు చూపించే వాళ్లు నచ్చరు.
కాలం గడిచింది.
ఇక ఊరిలో నాగేశ్వర్ గురించి చర్చలు తగ్గలేదు. పైగా పెరిగాయి.
ఎందుకంటే ప్రజలు ఒక విషయం గమనించారు.
ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు అది ఒక్కసారిగా జరిగే పొరపాటు కావచ్చు.
కానీ అదే తప్పును మళ్లీ మళ్లీ చేస్తే, అది పొరపాటు కాదు — స్వభావం అవుతుంది.
ఒక సాయంత్రం మేఘనా లెక్కలు రాస్తూ ఉండగా బయట ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్న మాటలు వినిపించాయి.
“నాగేశ్వర్ గారి గణితం గొప్పది.”
“అవును… కానీ మనిషిగా కూడా అంతే గొప్పవాడై ఉంటే ఇంకా బాగుండేది.”
ఆ మాటలు లోపల కూర్చున్న నాగేశ్వర్ చెవుల్లో కూడా పడ్డాయి.
ఈసారి మాత్రం అతను వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. ఎందుకంటే ఆ మాట చెప్పింది తన శత్రువులు కాదు… తన గురించి మంచి అభిప్రాయం కలిగిన వారే.
మేఘనా కూడా ఎక్కువ కాలం అక్కడ నిలవలేదు.
ఆమె పని విషయంలో ఎలాంటి తప్పు చేయలేదు. లెక్కలు కచ్చితంగా రాసేది. వచ్చినవారితో మర్యాదగా మాట్లాడేది. కానీ ఒక విషయం మాత్రం నాగేశ్వర్‌కు నచ్చలేదు.
ఆమె కూడా అప్పుడప్పుడు ప్రశ్నలు అడిగేది.
“సార్, ఇలా మాట్లాడడం సరైందేనా?”
“సార్, మనం విన్నది నిజమో కాదో తెలుసుకోకుండా తీర్పు ఇవ్వడం మంచిది కాదు కదా?”
ఇలాంటి మాటలు నాగేశ్వర్‌కు అసహనంగా అనిపించేవి.
ఒక రోజు ఆమెను పిలిచి,
“నీ పని బాగానే ఉంది. కానీ నాకు నా పనిలో జోక్యం చేసుకునేవాళ్లు వద్దు,” అని చెప్పి ఉద్యోగం నుంచి తీసేశాడు.
మేఘనా ఏమీ వాదించలేదు.
“సరే సార్. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. మీకు పని చేసే వాళ్లను మార్చేయొచ్చు. కానీ మీ గురించి ప్రజలు ఏర్పరుచుకున్న అభిప్రాయాన్ని మార్చడం అంత సులభం కాదు,” అని చెప్పి వెళ్లిపోయింది.
ఆ మాటలు కూడా నాగేశ్వర్ మనసులో ఎక్కువసేపు నిలవలేదు.
కొన్ని రోజుల తర్వాత మరో యువతిని పనిలో పెట్టుకున్నాడు. ఆమె పేరు అమీనా.
అమీనా చాలా పేద కుటుంబానికి చెందిన అమ్మాయి. ఈ ఉద్యోగం ఆమెకు చాలా అవసరం.
అందుకే మొదటి రోజు నుంచే ఆమె ఒక నిర్ణయం తీసుకుంది.
“నాకు జీతం ముఖ్యం. అనవసరంగా ఏ విషయాల్లోనూ మాట్లాడకూడదు.”
నాగేశ్వర్ ఏం మాట్లాడినా ఆమె వినేది. కానీ తన అభిప్రాయం చెప్పేది కాదు.
ఇది చూసి నాగేశ్వర్ చాలా సంతోషించాడు.
“ఇదిగో, ఇలాంటి వాళ్లే నాకు కావాలి. పని చూసుకుంటారు, వాదించరు,” అని అనుకున్నాడు.
కొన్ని వారాలు ప్రశాంతంగానే గడిచాయి.
ఒక రోజు కార్యాలయానికి వచ్చిన కొందరు గ్రామస్తులు వెళ్లిన తర్వాత నాగేశ్వర్ వాళ్ల గురించి వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టాడు.
అమీనా మౌనంగా కూర్చొని లెక్కలు రాస్తూనే ఉంది.
“చూశావా? వాళ్ల అసలు స్వభావం నాకు బాగా తెలుసు,” అని నాగేశ్వర్ అన్నాడు.
అమీనా తల ఊపింది. అంతే.
నాగేశ్వర్‌కు అది అంగీకారంలా అనిపించింది.
కానీ నిజానికి అమీనా అంగీకరించలేదు. వ్యతిరేకించలేదు కూడా.
ఆమెకు ఉద్యోగం అవసరం.
అయితే ఒక Yuvaraju viluva Oka Chellani Nanemఅనుకోని సంఘటన జరిగింది.
గ్రామంలో నాగేశ్వర్ గురించి మళ్లీ ఒక కొత్త చర్చ మొదలైంది.
ఈసారి అతను ఏమీ మాట్లాడలేదు. ఏమీ చేయలేదు.
కానీ పాత విషయాలన్నీ మళ్లీ బయటకు వచ్చాయి.
అప్పుడు నాగేశ్వర్ కోపంగా,
“ఎందుకు అందరూ నన్నే లక్ష్యంగా చేసుకుంటున్నారు?” అని అన్నాడు.
అమీనా ఈసారి మౌనంగా ఉండలేకపోయింది.
“సార్, ఒక ప్రశ్న అడగనా?”
“ఏమిటి?”
“సరోజ వెళ్లిపోయింది. మేఘనా వెళ్లిపోయింది. ఇప్పుడు నేను ఉన్నాను. కానీ మీ గురించి వచ్చే విమర్శలు మాత్రం మారలేదు. అయితే సమస్య వాళ్లలో ఉందా? లేక ఇంకెక్కడైనా ఉందా?”
ఆ ప్రశ్న విన్న నాగేశ్వర్ కాసేపు నిశ్శబ్దంగా కూర్చున్నాడు.
సరోజను మార్చాడు.
మేఘనను మార్చాడు.
ఉద్యోగులను మార్చడం అతనికి చాలా సులభం.
కానీ ఒక విషయం మాత్రం అతను ఇంకా మార్చలేకపోయాడు—
తనను తాను.
అయినా సరే ఈ అమ్మాయిని కూడా ఉద్యోగంలో నుండి తీసివేసాడు.
ఒకరోజు కొత్తమ్మాయి వచ్చి “హలో” అని పలకరించి, అక్కడ నిలబడింది. “ఎవరు?” అన్నాడు… “పేపర్ ప్రకటన చూసా” అంది. “నువ్వా” అన్నాడు. “అవును సార్” అంది… ఆమె వంక చూస్తూ నాగేశ్వర్ ఇలా అంటూ “చూడమ్మా… నాకు సలహాలు చెప్పకూడదు” అన్నాడు. ఆమె మాట్లాడుతూ “ఇంకొకరి ఊసు తీసే పనికిమాలిన అలవాటు లేదు” అంది. “సరే సరే,,, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకూడదు” అన్నాడు. “లేదు సర్, నాపని మాత్రమే నాకు ముఖ్యం కానీ నాతో మాట్లాడేవారు గురించి వ్యక్తిగతంగా విమర్శ చేసే దురలవాటు నాకు లేదు” అంది.
“ఏమిటి?, చెప్పినదానికి, సమాధానం వెంటనే చెప్పకూడదు” అన్నాడు.
“మనుషుల్లో మనిషి ఉండాలి కానీ మృగ లక్షణాలు గల మనుషులు సమాజానికి చేటు ‘ అంటూ విసురుగా వెళ్ళిపోయింది.
నాగేశ్వర్ షాక్ తో చూస్తూ కూర్చున్నాడు