vaadu vastunnadu? Maharani Rahasya Pranayam enduku?

ఈ కథకు కథాలయం కు ఏమిటి సంబంధం? vaadu vastunnadu? Maharani Rahasya Pranayam enduku? వెయ్యి సంవత్సరాల క్రితం… జరిగినదానికి రాజ్యంలో జరిగిన కుట్ర, కుట్రల నుండి కొడుకుని…..

కథలోకి vaadu vastunnadu? Maharani Rahasya Pranayam enduku?

పచ్చని అడవుల మధ్యలో, శతాబ్దాల చరిత్రను తన గోడలలో దాచుకున్న ఒక పురాతన రామమందిరం ఉండేది. ఆ ఆలయం గంటలు ఉదయం వేళ గాలిలో కలిసిపోతూ వినిపిస్తే, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దైవస్మరణలో మునిగిపోయేవారు. కానీ ఆ ప్రశాంతత వెనుక ఒక భయంకరమైన రహస్యం దాగి ఉంది.

ఆ రామమందిరానికి వెనుక వైపున, ఎత్తైన కొండల మధ్యలో ఒక గుహ ఉండేది. బయటికి చూస్తే సాధారణ రాతిగుహలా కనిపించినా, లోపలికి వెళ్తే చీకటి తన గర్భంలో ఏదో దాచుకున్నట్టుగా అనిపించేది. గోడలపై వెలిగించిన నూనె దీపాల కాంతి రాళ్లపై కంపిస్తూ, అక్కడి వాతావరణాన్ని మరింత భయానకంగా మార్చేది.

ఆ గుహలో నలుగురు వ్యక్తులు కూర్చున్నారు.

వారి ముఖాలు పూర్తిగా కనిపించకుండా నల్లని వస్త్రాలతో కప్పబడి ఉన్నాయి. మధ్యలో ఒక పురాతన తాళపత్రం పరచి ఉంది. దాని మీద రాజముద్రలాంటిది కనిపిస్తోంది.

“రేపటి సభతో అంతా మారిపోతుంది…” ఒకడు గుసగుసలాడాడు.

మరో వ్యక్తి గంభీరంగా అన్నాడు.
“మహారాణి మొదటి మాట మాట్లాడకముందే అది జరగాలి.”

ఆ మాట విన్న మిగిలిన ఇద్దరి కళ్లలో విచిత్రమైన ఆత్రుత మెరిసింది. భయం, ఆశ, ప్రతీకారం — మూడు భావాలు ఒకేసారి వారి ముఖాల్లో కనిపించాయి.

గుహ బయట గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. ఆలయ గంటలు అర్థరాత్రిలో స్వయంగా మోగినట్టుగా వినిపించాయి.

vaadu vastunnadu? Maharani Rahasya Pranayam enduku?
vaadu vastunnadu? Maharani Rahasya Pranayam enduku?

ఆ నలుగురిలో ఒకడు క్షణం తడబడిపోయాడు.

“ఇది శుభసూచకం కాదు…” అని నెమ్మదిగా అన్నాడు.

“ప్రమాదంతో తలపడితేనే, ఫలితం ఉండేది, అయ్యోపాపం అంటే ఉనికికే ప్రమాదం,” అని నాయకుడిలా కనిపించిన వ్యక్తి గట్టిగా చెప్పాడు.

ఆ తర్వాత గుహలో మళ్లీ నిశ్శబ్దం అలుముకుంది…

***

మరుసటి రోజు…

రాజధాని మొత్తం పండుగ వాతావరణంలో ఉంది. రాజప్రాసాదం వెలుపల సైనికులు కవచధారుల్లా నిలబడి ఉన్నారు. లోపల రాజసభ బంగారు స్తంభాలతో, విలాసవంతమైన వస్త్రాలతో కళకళలాడుతోంది.

సభ మధ్యలో సింహాసనం.

ఆ సింహాసనంపై తొలిసారి అధికారికంగా కొలువుదీరబోతున్న మహారాణి.

ఆమె ముఖంలో రాజసత్తా ఉన్నా, కళ్లలో మాత్రం ఒక తెలియని ఒత్తిడి కనిపిస్తోంది. ఎందుకో తెలియదు కానీ, ఉదయం నుంచే ఆమె హృదయం అశాంతిగా ఉంది.

ఉదయం ఆమెకు సమాచారం అందింది, ఏమని అంటే “మహారాణి, సభలో మీపై ఎదో కుట్ర జరగనున్నది…” ఇప్పుడు మహారాణి అది ఏమిటో? ఆలోచనలో….

ఆమె ఇరువైపులా మంత్రులు, సామంతులు కూర్చున్నారు. అందరూ మహారాణి మొదటి ప్రసంగం కోసం ఎదురుచూస్తున్నారు.

సభలో నిశ్శబ్దం అలుముకుంది.

మహారాణి నెమ్మదిగా లేచింది.

ఆమె పెదవులు మొదటి మాట పలకబోతుండగా…

ఒక్కసారిగా సభ ద్వారాల దగ్గర నుంచి ఒక వికృతమైన అరుపు వినిపించింది.

అందరి చూపులు అక్కడికే మళ్లాయి.

ఒక సైనికుడు విచిత్రంగా నవ్వుతున్నాడు. అతని కళ్లలో భయం లేదు… కానీ పిచ్చి మాత్రం ఉంది. అతను తన తలని గోడలకు కొట్టుకుంటూ, “వాడు వస్తున్నాడు… వాడు వస్తున్నాడు…” అని కేకలు వేస్తున్నాడు.

సభలోని కొందరు సైనికులు అతన్ని ఆపడానికి పరుగెత్తారు.

కానీ ఆ సైనికుడు ఒక్కసారిగా తన ఖడ్గాన్ని లాక్కొని…

అందరూ చూస్తుండగానే తన గుండెల్లో దింపుకున్నాడు.

రక్తం సభ నేలపై చిందింది.

ఒక్క క్షణం…

సభ మొత్తం గడ్డకట్టిపోయింది.

మంత్రుల ముఖాల్లో భయం స్పష్టంగా కనిపించింది. కొందరు సామంతులు కుర్చీల నుంచి లేచిపోయారు. కొందరు దేవుని పేర్లు జపించడం ప్రారంభించారు.

మహారాణి చేతులు స్వల్పంగా వణికాయి.

ఆమె జీవితంలో ఇదే మొదటిసారి రాజసభలో మాట్లాడబోతోంది. కానీ మొదటి క్షణంలోనే మరణం తన కళ్లముందు నిలబడింది.

ఆ సైనికుడు చనిపోవడానికి ముందు చెప్పిన మాటలు మాత్రం ఇంకా సభ గోడల మధ్య ప్రతిధ్వనిస్తున్నాయి…

“వాడు వస్తున్నాడు…” vaadu vastunnadu? Maharani Rahasya Pranayam enduku?

మహారాణి కళ్లలో తీవ్ర మనస్తాపం కనిపించింది. ఆమె ఏదో చెప్పాలని ప్రయత్నించింది. కానీ మాట బయటకు రాలేదు.

చివరకు ప్రధానమంత్రి నెమ్మదిగా లేచి ప్రకటించాడు.

“ఈ రోజు రాజసభను వాయిదా వేస్తున్నాం.”

సభలోని అందరూ ఒక్కొక్కరిగా బయటికి వెళ్తుండగా, మహారాణి మాత్రం సింహాసనంపైనే కూర్చుని ఉంది.

ఆమె మనసులో ఒక్క ప్రశ్న మాత్రమే తిరుగుతోంది.

“ఆ సైనికుడు చివరిగా చెప్పిన ‘వాడు’ ఎవరు…?”

రాజసభ వాయిదా పడిన కొన్ని గంటల తర్వాత…

సూర్యాస్తమయం అవుతోంది. రాజప్రాసాదం బయట బంగారు కాంతి విరజిమ్ముతున్నా, లోపల మాత్రం ఒక విచిత్రమైన నిశ్శబ్దం వ్యాపించింది. ఉదయం జరిగిన సంఘటనతో రాజమహల్ మొత్తం భయంతో కమ్ముకుంది. సైనికులు కూడా గుసగుసలకే పరిమితమయ్యారు.

రాజప్రాసాదం లోపల అత్యంత రహస్యంగా ఉండే అంతరంగిక మందిరం ముందు ఇద్దరు రక్షకులు ఖడ్గాలతో అప్రమత్తంగా నిలబడి ఉన్నారు.

ఆ మందిరంలో…

మహారాణి ఒంటరిగా నిలబడి ఉంది.

vaadu vastunnadu? Maharani Rahasya Pranayam enduku?
vaadu vastunnadu? Maharani Rahasya Pranayam enduku?

ఆమె కిటికీ దగ్గర నిలబడి బయట ఆకాశాన్ని చూస్తోంది. కానీ ఆమె చూపు ఆకాశంపై లేదు… ఉదయం సభలో జరిగిన ఆ దృశ్యంపైనే ఉంది.

సైనికుడు తనను చూసిన విధానం…
ఆ భయంకరమైన నవ్వు…
“వాడు వస్తున్నాడు…” అన్న మాట…

ఆమె చేతులు స్వల్పంగా వణికాయి.

అంతలో మందిర ద్వారం నెమ్మదిగా తెరుచుకుంది.

ప్రధానమంత్రి లోపలికి అడుగుపెట్టాడు.

అతను రాజ్యంలో అత్యంత తెలివైనవాడిగా పేరు పొందాడు. కానీ ఈ రోజు అతని ముఖంలో కూడా స్పష్టమైన ఆందోళన కనిపిస్తోంది.

“మహారాణి…” అని నమస్కరించాడు.

ఆమె నెమ్మదిగా వెనక్కి తిరిగింది.

“కూర్చోండి మంత్రి గారూ,” అని చెప్పినా, ఆమె గొంతులో అలసట స్పష్టంగా వినిపించింది.

మంత్రి కూర్చున్నాడు. కానీ కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దమే కొనసాగింది.

చివరకు మహారాణి నెమ్మదిగా అడిగింది.

“ఆ సైనికుడి గురించి ఏమైనా తెలిసిందా?”

మంత్రి ముఖం మరింత గంభీరంగా మారింది.

“తెలిసింది మహారాణి… కానీ తెలిసిన విషయం మరింత భయంకరంగా ఉంది.”

ఆమె కనుబొమ్మలు ముడుచుకున్నాయి.

మంత్రి ముందుకు వాలి మెల్లగా అన్నాడు.

“ఆ సైనికుడు మూడు రోజుల క్రితమే మరణించాడు.”

ఆ మాట విన్న క్షణం…

మహారాణి గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది.

“ఏం…?” ఆమె కళ్లలో ఆశ్చర్యం స్పష్టంగా కనిపించింది.

“అవును మహారాణి. సరిహద్దు అడవుల్లో గస్తీ వేస్తూ ఉండగా అతను చనిపోయాడని నివేదిక వచ్చింది. స్వయంగా అతని అంత్యక్రియలు కూడా జరిగాయి.”

మహారాణి శ్వాస బరువెక్కింది.

“అయితే ఈ రోజు సభలో ఉన్నది ఎవరు…?”

మంత్రి సమాధానం చెప్పలేదు.

అతని నిశ్శబ్దమే మరింత భయాన్ని కలిగించింది.

మందిరం బయట ఒక్కసారిగా గాలి బలంగా వీచింది. కిటికీ తెరలు ఎగిరాయి. గదిలోని దీపాలు కంపించాయి.

మహారాణి ఒక్కసారిగా ఆందోళనగా చుట్టూ చూసింది.

మంత్రి మెల్లగా అన్నాడు.

vaadu vastunnadu? Maharani Rahasya Pranayam enduku?
vaadu vastunnadu? Maharani Rahasya Pranayam enduku?

“ఇది సాధారణ విషయం కాదు మహారాణి… ఎవరో రాజ్యాన్ని భయంతో కూల్చాలని ప్రయత్నిస్తున్నారు. లేదా…”

అతను క్షణం ఆగిపోయాడు.

“లేదా నిజంగానే ఏదో అశుభం రాజ్యంలోకి అడుగుపెట్టింది.”

ఆ మాటలతో గదిలో మళ్లీ నిశ్శబ్దం అలుముకుంది.

మహారాణి మాట్లాడుతూ “ఏం….” అంటూ మాట్లాడలేక ఊరుకుంది.

మంత్రి మాట్లాడుతూ “మహారాణి, స్త్రీ పాలివ్వాలి కానీ పాలించరాదు, ఇది ఏనాటి నుండో మన రాజ్యంలో వస్తున్న సంప్రదాయం” అన్నాడు.

రాణి అతనిని విచిత్రంగా చూసింది…

మళ్ళి మంత్రి మాట్లాడుతూ “పాలించేవారికి ఉండేవి, పాలిచ్చేవారికి ఉండవు. రాజ్యంలో చాలామంది అభిప్రాయం” అన్నాడు.

ఈ సారి మహారాణి మంత్రిని అసహ్యంగా చూసింది.

అదే సమయంలో…

రాజప్రాసాదం వెలుపల, చీకటిలో దాక్కుని ఉన్న ఒక వ్యక్తి అంతరంగిక మందిరం వైపు చూస్తూ నెమ్మదిగా నవ్వుతున్నాడు…

రాజప్రాసాదానికి దూరంగా…

భూమి అడుగున నిర్మించినట్టుగా కనిపించే ఒక రహస్య మందిరం. మందిరం గోడలపై వేలాడుతున్న అగ్నిదీపాలు మందమైన కాంతిని విరజిమ్ముతున్నాయి. గదిలో సుగంధ ద్రవ్యాల వాసన వ్యాపించి ఉంది. బయట ప్రపంచానికి తెలియకుండా, అక్కడ కాలమే ఆగిపోయినట్టుగా అనిపిస్తోంది.

vaadu vastunnadu? Maharani Rahasya Pranayam enduku?
vaadu vastunnadu? Maharani Rahasya Pranayam enduku?

ఆ గదిలో ఒక పురుషుడు రాతి ఆసనంపై వెనక్కి ఆనుకుని కూర్చున్నాడు. అతని ముఖం పూర్తిగా చీకటిలోనే ఉంది. కానీ కళ్లలో మాత్రం ఒక ప్రమాదకరమైన సంతృప్తి మెరుస్తోంది.

అతని పక్కనే ఒక స్త్రీ నిశ్శబ్దంగా కూర్చుంది.

ఆమె అతని ముఖాన్ని గమనిస్తూ నెమ్మదిగా నవ్వింది.

“పాపం మహారాణి…” అని తక్కువ స్వరంలో అంది.

ఆ మాట విన్న వెంటనే అతని కళ్లలో ఒక్కసారిగా కోపం రగిలింది.

“పాపం ఏమిటి?” అని గట్టిగా అన్నాడు.

అతను ఆసనం నుంచి ముందుకు వంగి, దాదాపు విషంలా మాటలు విసిరాడు.

“దానిని ఏం చేస్తానో చూడు! బ్రతకడం కంటే చావే ఉత్తమం అనుకునే స్థితికి తీసుకెళ్తాను. చావలేక… బ్రతకలేక… ఏం చేయాలో తెలియక… తనకే తనపై భయం పుడుతుంది.”

అతని గొంతులో కక్ష స్పష్టంగా వినిపిస్తోంది. ఏళ్లుగా దాచుకున్న ద్వేషం ఒక్కో మాటలో బయటపడుతోంది.

“రోజుకో భయం…
రాత్రికో పీడకల…
చివరికి తన నీడను చూసినా వణికిపోవాలి మహారాణి…”

అతను ఇంకా కోపంగా మాట్లాడబోతుండగా—

vaadu vastunnadu? Maharani Rahasya Pranayam enduku?
vaadu vastunnadu? Maharani Rahasya Pranayam enduku?

“ఏది అతిగా ఆశపడకూడదు, పగ కూడా నెరవేరకపోతే ప్రమాదం” అతని మాటలు అక్కడికే ఆగిపోయాయి.

కొన్ని క్షణాలు గదిలో మళ్లీ నిశ్శబ్దమే మిగిలింది.

అదే సమయంలో…

రాజప్రాసాదంలోని మహారాణి గదిలో ఒక దీపం స్వయంగా ఆరిపోయింది…

ఆ రాత్రి…
రాజప్రాసాదం మొత్తం నిద్రలోకి జారుకుంటున్నా, మహారాణి కళ్లకు మాత్రం నిద్ర చేరలేదు.

ఆమె గదిలో వెలిగిన చివరి దీపం కూడా ఆరిపోయిన తర్వాత, గది మొత్తం చీకటితో నిండిపోయింది. బయట గాలి శబ్దం మాత్రమే వినిపిస్తోంది. కానీ ఆ చీకటిలో… ఆమెకు ఇంకో శబ్దం కూడా వినిపించింది.

ఎవరో నెమ్మదిగా నడుస్తున్న అడుగుల శబ్దం.

మొదట ఆమెకు భ్రమలా అనిపించింది. కానీ ఆ అడుగులు క్రమంగా దగ్గరపడుతున్నాయి.

టక్… టక్… టక్…

మహారాణి గుండె వేగంగా కొట్టుకుంది.

“ఎవరు అక్కడ?” అని గట్టిగా అడిగింది.

సమాధానం లేదు.

ఆమె వెంటనే పక్కనే ఉన్న వెండి గంటను మోగించింది. బయట ఉన్న రక్షకులు లోపలికి రావాలి. కానీ…

ఎవరూ రాలేదు.

ఆమె ముఖంలో ఆందోళన పెరిగింది.

మరోసారి గంటను బలంగా మోగించింది.

అయినా నిశ్శబ్దమే.

అప్పుడే గదిలోని మూలచీకటిలో ఏదో కదిలినట్టుగా అనిపించింది.

మహారాణి నెమ్మదిగా వెనక్కి అడుగు వేసింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. కిటికీ బయట నుంచి చంద్రకాంతి కొద్దిగా లోపల పడుతోంది. ఆ వెలుతురులో…

ఒక నీడ కనిపించింది.

మనిషిలా ఉంది. కానీ ముఖం స్పష్టంగా కనిపించడం లేదు.

ఆ నీడ నెమ్మదిగా ముందుకు కదిలింది.

“నువ్వెవరు?” మహారాణి గొంతు కంపించింది.

ఆ వ్యక్తి ఒక్కసారిగా నవ్వాడు.

ఆ నవ్వు వినగానే మహారాణి కళ్లలో భయం రెట్టింపు అయింది.

అదే నవ్వు…

ఉదయం సభలో చనిపోయిన సైనికుడు నవ్వినట్టే ఉంది.

“నువ్వు…” ఆమె మాట ఆగిపోయింది.

ఆ నీడ ఒక్క అడుగు ముందుకు వేసింది.

“వాడు వస్తున్నాడు…” అని గుసగుసలాడింది, ఆ ముసుగు నీడ.

ఆ మాట విన్న క్షణం మహారాణి వెన్నులో చలి పరిగెత్తింది.

“ముసుగులో మాట్లాడడం కాదు, ముఖం చూపి మాట్లాడు” అని గట్టిగా అరుస్తూ అడిగింది.

కానీ ఆ నీడ సమాధానం చెప్పలేదు.

హటాత్తుగా గదిలోని కిటికీలు బలంగా తెరుచుకున్నాయి. గాలి వేగంగా లోపలికి దూసుకొచ్చింది. తెరలు ఎగిరిపోయాయి. గదిలో ఉన్న వస్తువులు కదిలిపోయాయి.

ఆ గందరగోళంలో మహారాణి కళ్లను కాసేపు మూసుకుంది.

మళ్లీ తెరిచేసరికి…

ఆ నీడ కనిపించలేదు.

గది మళ్లీ ఖాళీగా ఉంది.

మహారాణి శ్వాస వేగంగా సాగుతోంది. ఆమె వెంటనే ద్వారం దగ్గరకు పరుగెత్తింది. తలుపు తెరిచింది.

బయట ఇద్దరు రక్షకులు నేలపై పడిపోయి ఉన్నారు.

వాళ్లు చనిపోలేదు… కానీ స్పృహలో లేరు.

ఆమె భయంతో వెనక్కి తగ్గింది.

అప్పుడే ప్రాసాదం అంతటా ఒక్కసారిగా భారీ గంట శబ్దం మార్మోగింది.

డంగ్…!

డంగ్…!

డంగ్…!

అది రాజమహల్ ప్రధానగంట.

ఆ గంట అర్థరాత్రి సమయంలో మోగడం అంటే…

రాజ్యంలో అత్యవసర ప్రమాదం వచ్చినట్టే.

కొద్ది క్షణాల్లోనే సైనికులు, మంత్రులు ప్రాసాదం మధ్య ప్రాంగణానికి చేరుకున్నారు. మహారాణి కూడా త్వరగా అక్కడికి వచ్చింది.

కానీ అక్కడ కనిపించిన దృశ్యం చూసి అందరూ స్థంభించిపోయారు.

ప్రాంగణం మధ్యలో…

ఒక మృతదేహం వేలాడుతోంది.

అది రాజవైద్యుడి శవం.

అతని కళ్లలో భయం ఇంకా అలాగే గడ్డకట్టిపోయింది.

అతని ఛాతీపై రక్తంతో ఒక గుర్తు గీసి ఉంది.

అదే గుర్తు…

ఆ గుహలో తాళపత్రంపై ఉన్న రాజముద్ర.

మంత్రి ముఖం ఒక్కసారిగా తెల్లబడిపోయింది.

మహారాణి అతని వైపు తిరిగి చూసింది.

“ఈ గుర్తు నీకు తెలుసా?” అని అడిగింది.

మంత్రి కాసేపు మాట్లాడలేకపోయాడు.

చివరకు అతను వణుకుతున్న గొంతుతో అన్నాడు.

“ఇది… నిషిద్ధ చిహ్నం మహారాణి.”

“నిషిద్ధమా?”

మంత్రి నెమ్మదిగా తల ఊపాడు.

“వెయ్యి సంవత్సరాల క్రితం ఈ రాజ్యాన్ని రక్తంతో ముంచెత్తిన ఒక రహస్య వంశానికి చెందిన గుర్తు ఇది. వాళ్లందరూ చనిపోయారని అనుకున్నాం… కానీ—”

అతని మాట మధ్యలోనే ఆగిపోయింది. vaadu vastunnadu? Maharani Rahasya Pranayam enduku?

ఎందుకంటే…

ఆ సమయంలో ప్రాంగణం చివర నిలబడి ఉన్న ఒక చిన్న బాలుడు ఒక్కసారిగా మహారాణి వైపు చూపిస్తూ భయంతో అరవడం ప్రారంభించాడు.

“అతను… ఆమె వెనుక నిలబడి ఉన్నాడు…!”

అందరూ ఒక్కసారిగా మహారాణి వెనక్కి తిరిగి చూశారు.

కానీ అక్కడ…

ఎవరూ లేరు.

కేవలం చీకటి మాత్రమే ఉంది.

అయితే ఆ చీకటిలో రెండు కళ్లలా మెరిసిన ఎర్రటి కాంతిని మాత్రం మహారాణి స్పష్టంగా చూసింది…

మహారాణి ఆ ఎర్రటి కళ్లను చూసిన క్షణం…
ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. కానీ భయంతో అక్కడే నిలబడిపోలేదు.

ఎందుకంటే చిన్నప్పటి నుంచే ఆమెకు ఒక విషయం నేర్పించారు.

“రాజ్యాన్ని పాలించేవాడు ముందు భయాన్ని జయించాలి.”

ఆ మాట ఆమె తండ్రి చివరిసారి చెప్పిన మాట.

ఆ జ్ఞాపకం వచ్చిన వెంటనే మహారాణి తనలోని భయాన్ని బలవంతంగా అణచుకుంది. ఆమె వెంటనే తన నడుముకు కట్టుకున్న చిన్న కత్తిని బయటకు తీసింది.

“అందరూ వెనక్కి వెళ్లండి!” అని గట్టిగా అరిచింది.

ఆమె స్వరం వినగానే సైనికులు కాసేపు తడబడిపోయారు. ఎందుకంటే సభలో భయంతో కనిపించిన అదే మహారాణి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.

ఆమె నెమ్మదిగా ఆ చీకటి వైపు అడుగులు వేసింది.

కానీ…

ఆ ఎర్రటి కళ్ల కాంతి ఒక్కసారిగా మాయమైంది.

అదే సమయంలో ప్రాంగణం పైభాగం నుంచి ఒక నల్లని వస్త్రం కిందకు జారింది. అందరి చూపులు అక్కడికి మళ్లాయి.

ఒక వ్యక్తి రాజమహల్ పైకప్పుపై నిలబడి ఉన్నాడు.

అతని ముఖం పూర్తిగా ముసుగుతో కప్పబడి ఉంది.

“ఆపండి వాడిని!” అని మంత్రి అరిచాడు.

సైనికులు వెంటనే మెట్లవైపు పరుగెత్తారు.

కానీ ఆ వ్యక్తి వెనక్కి తిరిగి దూకేశాడు.

మహారాణి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆమె కూడా అతని వెంట పరుగెత్తింది.

మంత్రి ఆశ్చర్యపోయాడు.

“మహారాణి! ఆగండి!” అని అరుస్తూ వెంబడించాడు.

రాజమహల్ వెనుకభాగం చీకటిగా ఉంది. ఆ ముసుగు వ్యక్తి వేగంగా పరుగెడుతున్నాడు. మహారాణి కూడా అతడిని వెంబడిస్తోంది.

అతను ఒక్కసారిగా ఆగిపోయాడు.

ఆమె కూడా కత్తిని సిద్ధం చేసుకుని ఆగింది.

“నువ్వెవరు?” అని అడిగింది.

అతను నెమ్మదిగా నవ్వాడు.

“నీ రాజ్యం గతం…” అని సమాధానం ఇచ్చాడు.

ఆ మాట విన్న మహారాణి కళ్లలో అయోమయం కనిపించింది.

అతను మళ్లీ అన్నాడు.

“నీ తండ్రి చేసిన పాపాల ప్రతీకారం.”

ఆమె ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారింది.

“నా తండ్రి గురించి అబద్ధాలు చెప్పకు.”

“అబద్ధమా?” అతను కోపంగా నవ్వాడు.
“నీ తండ్రి సింహాసనం కోసం ఎంతమందిని సజీవంగా కాల్చాడో తెలుసా? ఎన్ని కుటుంబాలను రాత్రికి రాత్రే మాయం చేశాడో తెలుసా?”

మహారాణి ఒక్క క్షణం నిశ్శబ్దంగా నిలబడిపోయింది.

ఎందుకంటే…

ఆ మాటలు ఆమె చిన్నప్పటి నుంచి రహస్యంగా వినే పుకార్లలాగే ఉన్నాయి.

కానీ రాజమహల్‌లో ఎవరూ వాటి గురించి బహిరంగంగా మాట్లాడలేదు.

ఆమె ఏదో అడగబోతుండగా—

అతను ఒక్కసారిగా ఒక చిన్న పొగబాంబును నేలపై విసిరాడు.

చుట్టూ తెల్లని పొగ వ్యాపించింది.

మహారాణి దగ్గుతూ వెనక్కి తగ్గింది.

పొగ తొలగేసరికి…

అతను కనిపించలేదు.

కానీ నేలపై ఒక వస్తువు మాత్రం మిగిలింది.

పురాతన రాజముద్రతో ఉన్న ఒక ఉంగరం.

మంత్రి అక్కడికి చేరుకుని ఆ ఉంగరాన్ని చూసిన క్షణం అతని ముఖం మారిపోయింది.

“ఇది ఎలా సాధ్యం…” అని నెమ్మదిగా అన్నాడు.

“నీకు ఇది తెలుసా?” మహారాణి అడిగింది.

మంత్రి కాసేపు ఆలోచించి మెల్లగా చెప్పాడు.

“ఇది ‘అగ్నివంశం’ గుర్తు మహారాణి.”

“అగ్నివంశమా?”

“అవును. మీ తండ్రి రాజయ్యే ముందు ఈ రాజ్యంపై హక్కు ఉన్న అసలు వంశం వాళ్లది. కానీ ఒకే రాత్రిలో ఆ వంశం మొత్తం నాశనం అయిందని చరిత్ర చెబుతుంది.”

“అంటే వాళ్లు ఇంకా బ్రతికే ఉన్నారా?”

మంత్రి సమాధానం చెప్పలేదు.

ఎందుకంటే అతనికి కూడా ఇప్పుడు అదే భయం మొదలైంది.

అప్పుడే మహారాణి మనసులో మరో ప్రశ్న మెదిలింది.

“సభ ఎందుకు మొదలవగానే ఆ సైనికుడు చనిపోయాడు? నేను మొదటి మాట కూడా ఎందుకు మాట్లాడలేకపోయాను?”

మంత్రి లోతుగా శ్వాస తీసుకున్నాడు.

“ఎందుకంటే… అదే వారి లక్ష్యం మహారాణి.”

ఆమె ఆశ్చర్యంగా చూసింది.

మంత్రి నెమ్మదిగా వివరించడం ప్రారంభించాడు.

“రాజ్యంలో ఒక పురాతన నమ్మకం ఉంది. కొత్త రాజు లేదా రాణి మొదటి అధికారిక మాటతోనే వారి పాలన ప్రారంభమవుతుందని ప్రజలు విశ్వసిస్తారు. కానీ ఆ మాట పలకకముందే సభ ఆగిపోతే… ఆ పాలనను దేవుడు అంగీకరించలేదని భావిస్తారు.”

మహారాణి కళ్లలో తీవ్ర ఆందోళన కనిపించింది.

మంత్రి కొనసాగించాడు.

“అందుకే సభలో భయాన్ని సృష్టించారు. నీ మొదటి మాట బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు రాజ్యంలో పుకార్లు మొదలవుతాయి.”

“ఏ పుకార్లు?” vaadu vastunnadu? Maharani Rahasya Pranayam enduku?

మంత్రి నెమ్మదిగా అన్నాడు.

“ఈ రాజ్యానికి నిజమైన రాణి నువ్వు కాదని…”

రాజప్రాసాదం అంతా నిద్రలో మునిగిపోయిన అర్థరాత్రి…

మహారాణి మాత్రం ఇంకా మేల్కొని ఉంది.

మంత్రి చెప్పిన మాటలు ఆమె మనసులో తిరుగుతున్నాయి.

“ఈ రాజ్యానికి నిజమైన రాణి నువ్వు కాదని…”

ఆ ఒక్క మాట ఆమె హృదయంలో భయంకంటే పెద్ద సందేహాన్ని నింపింది.

అంతలో ఆమె గది బయట నుంచి మెల్లగా తలుపు తట్టిన శబ్దం వినిపించింది.

టక్… టక్… vaadu vastunnadu? Maharani Rahasya Pranayam enduku?

మహారాణి వెంటనే అప్రమత్తమైంది.

“ఎవరు?” అని అడిగింది.

బయట నుంచి ఒక స్త్రీ స్వరం వినిపించింది.

“నేనే మహారాణి… మీ దాసి మాళవిక.”

మహారాణి తలుపు తెరిచింది.

మాళవిక చిన్నప్పటి నుంచీ ఆమెకు సేవ చేస్తున్న విశ్వసనీయ దాసి. కానీ ఈ రాత్రి ఆమె ముఖంలో తీవ్రమైన భయం కనిపిస్తోంది.

“ఏమైంది?” మహారాణి అడిగింది.

మాళవిక లోపలికి వచ్చి వెంటనే తలుపు మూసేసింది.

“ఇక్కడ మీరు క్షణం కూడా ఉండకూడదు మహారాణి,” అని వణుకుతున్న స్వరంతో అంది.

“ఎందుకు?”

“మీ గదిలోనే మీపై నిఘా ఉంది.”

ఆ మాట విన్న మహారాణి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది.

మాళవిక గదిలోని పెద్ద దీపస్తంభం వైపు చూపించింది.

“దాని వెనుక రహస్య మార్గం ఉంది. ఆ మార్గం ద్వారా ప్రతిరోజూ మీ గదిలో జరిగేదంతా బయటికి చేరుతోంది.”

మహారాణి కళ్లలో కోపం మెరిపించింది.

“ఎవరు చేస్తున్నారు ఇవన్నీ?”

మాళవిక కాసేపు మౌనంగా నిలబడింది.

చివరకు నెమ్మదిగా అంది.

“రాజమాత.”

ఆ మాట విన్న క్షణం మహారాణి శరీరం గడ్డకట్టిపోయింది.

“అసంభవం…” ఆమె పెదవులు కంపించాయి.

రాజమాత…

అంటే ఆమెను చిన్నప్పటి నుంచి పెంచిన మహిళ.

రాజు మరణించిన తర్వాత రాజ్యాన్ని నిలబెట్టింది కూడా ఆమెనే.

“లేదు మహారాణి,” మాళవిక నెమ్మదిగా అంది,
“రాజమాత మీపై ప్రేమ నటించింది. కానీ సింహాసనం మీద అసలు ఆశ ఆమె కుమారుడిదే.”

“కుమారుడా…?”

మహారాణి ఆశ్చర్యంతో చూసింది.

ఎందుకంటే రాజమాతకు సంతానం లేదని రాజ్యం మొత్తం నమ్ముతుంది.

మాళవిక కళ్లలో నీళ్లు మెరిశాయి.

“ఆ రహస్యం బయటపడకూడదని… ఎన్నో సంవత్సరాల క్రితం ఆ బిడ్డను రహస్యంగా దాచేశారు.”

మహారాణి గుండె వేగంగా కొట్టుకుంది.

“అంటే… ఇప్పుడు నన్ను తొలగించి అతన్ని రాజుగా ప్రకటించాలనుకుంటున్నారా?”

మాళవిక తల ఊపింది.

“కేవలం తొలగించడం కాదు మహారాణి… మిమ్మల్ని ప్రజల ముందే పిచ్చిదానిలా చూపించాలనుకుంటున్నారు.”

ఆ మాట విన్న క్షణం మహారాణికి సభలో జరిగిన ప్రతీ సంఘటన అర్థమవ్వడం ప్రారంభమైంది.

చనిపోయిన సైనికుడు…

రాత్రిళ్లు కనిపించే నీడలు…

ఆరిపోతున్న దీపాలు…

ఇవన్నీ భయపెట్టడానికి చేసిన కుట్ర.

అప్పుడే బయట నుంచి సైనికుల పరుగుల శబ్దం వినిపించింది.

“ఆమె గదిని చుట్టుముట్టండి!” అని ఎవరో గట్టిగా అరిచారు.

మాళవిక ఒక్కసారిగా భయంతో మహారాణి చేతిని పట్టుకుంది.

“వాళ్లు వచ్చేశారు!”

“ఎక్కడికి వెళ్దాం?”

మాళవిక వెంటనే దీపస్తంభాన్ని పక్కకు జరిపింది.

దాని వెనుక రాతి మెట్లు కనిపించాయి.

“ఈ దారి బయటికి తీసుకెళ్తుంది.”

మహారాణి క్షణం ఆగింది.

“నువ్వు?”

మాళవిక స్వల్పంగా నవ్వింది.

“నేను వస్తే వాళ్లకు అనుమానం వస్తుంది. మీరు వెళ్లాలి మహారాణి.”

బయట తలుపులు బలంగా కొట్టడం ప్రారంభమైంది.

ధడ్! ధడ్! vaadu vastunnadu? Maharani Rahasya Pranayam enduku?

మాళవిక ఆమెను మెట్లవైపు నెట్టింది.

“త్వరగా వెళ్లండి!”

మహారాణి చివరిసారి ఆమె వైపు చూసి ఆ రహస్య మార్గంలోకి దిగిపోయింది.

కొన్ని క్షణాల తర్వాత…

రాజగది తలుపులు బలంగా తెరుచుకున్నాయి.

సైనికులు లోపలికి దూసుకొచ్చారు.

కానీ గది ఖాళీగా ఉంది.

అదే సమయంలో…

రాజప్రాసాదానికి దూరంగా, అడవుల మధ్య నిర్మాణంలో ఉన్న ఒక పురాతన గుడి దగ్గర ఒక వృద్ధుడు దీపం వెలిగిస్తున్నాడు.

ఆ గుడి ఇంకా పూర్తికాలేదు.

అర నిర్మిత గోడలు… రాళ్ల కుప్పలు… నిశ్శబ్దం…

అప్పుడే చీకటిలో నుంచి మహారాణి బయటికి వచ్చింది.

ఆ వృద్ధుడు ఆమెను చూసి ఆశ్చర్యపడలేదు.

ఆమె కోసం ఎదురు చూస్తున్నట్టే ప్రశాంతంగా నిలబడ్డాడు.

“మీరు ఆలస్యంగా వచ్చారు మహారాణి,” అని నెమ్మదిగా అన్నాడు.

మహారాణి ఆశ్చర్యంగా చూసింది.

“మీకు నా గురించి తెలుసా?”

వృద్ధుడు స్వల్పంగా నవ్వాడు.

“మీ తండ్రి చనిపోవడానికి ముందు… మిమ్మల్ని కాపాడమని నాకిచ్చిన మాట ఇంకా మర్చిపోలేదు.”

ఆమె కళ్లలో సందేహం పెరిగింది.

“మీరు ఎవరు?”

వృద్ధుడు గుడిలోని రాముడి విగ్రహం వైపు చూస్తూ మెల్లగా అన్నాడు.

“ఈ రాజ్యానికి చివరి రహస్య రక్షకుడు…”

ఆ వృద్ధుడు మహారాణిని గుడి లోపలికి తీసుకెళ్లాడు.

ఆ గుడి బయట నుంచి చూస్తే ఇంకా నిర్మాణంలో ఉన్నట్టే కనిపిస్తోంది. కానీ లోపలికి అడుగుపెట్టగానే మహారాణికి ఏదో విచిత్రమైన అనుభూతి కలిగింది.

గోడలపై చెక్కిన శిల్పాలు…

వాటి మధ్య కనిపిస్తున్న విచిత్రమైన గుర్తులు…

ఆమె ఇంతకుముందు ఎప్పుడూ చూడని రహస్య రాతలు…

మధ్యలో పెద్ద రాముడి విగ్రహం.

వృద్ధుడు ఆ విగ్రహం ముందు నిలబడి కళ్లుమూశాడు.

“క్షమించు ప్రభూ… నిజం బయటపడే సమయం వచ్చింది,” అని మెల్లగా అన్నాడు.

ఆ తర్వాత విగ్రహం పక్కనున్న దీపాన్ని తిప్పాడు.

గుడి నేల ఒక్కసారిగా కంపించింది.

మహారాణి ఒక్క అడుగు వెనక్కి వేసింది.

రాముడి విగ్రహం వెనుక భాగం నెమ్మదిగా పక్కకు జరగడం ప్రారంభమైంది.

దాని వెనుక…

భూమి అడుగునకు తీసుకెళ్లే విశాలమైన మెట్లు కనిపించాయి.

చల్లటి గాలి పైకి వచ్చింది.

ఆ గాలిలో ఏదో పాత జ్ఞాపకాల వాసన ఉంది.

“ఇది ఏమిటి?” మహారాణి ఆశ్చర్యంగా అడిగింది.

వృద్ధుడు ఆమె వైపు చూడకుండా అన్నాడు.

vaadu vastunnadu? Maharani Rahasya Pranayam enduku?
vaadu vastunnadu? Maharani Rahasya Pranayam enduku?

“ఇక్కడ కూడా మీరు ఉండడం సురక్షితం కాదు, మహారాణి, ఇక్కడ నుండి ఇది మరో రహస్య ప్రదేశం అక్కడికి వెళ్ళిపొండి”

మహారాణి ఆయమోయంగా “ఇది రహస్య ప్రదేశమే కదా, మరొకటి ఎందుకు?”

“అయ్యో మహారాణి, రాజప్రసాదం నుండి ఉండే రహస్య మార్గం ఒక్కరికే ఎందుకు తెలుస్తుంది, ఇంకా మిగిలినవారికి తెలుస్తుంది…”

“అవునా” అంది మహారాణి

ఆమె అయోమయంగా అతని వెంట నడిచింది.

మెట్లు చాలా లోతుకు తీసుకెళ్లాయి.

చాలా సేపు తర్వాత…

అడవిలో పెద్ద కొండరాయి దగ్గరకు వచ్చారు.

ఆమె వెనుకకు తిరిగి చూసింది, తనతో వచ్చినవారు ఎవరూ లేరు.

అడవి నిశ్శబ్దంగా ఉంది…
గాలిలో ఆకులు కదులుతున్న శబ్దం తప్ప మరే శబ్దం వినిపించలేదు.
చంద్రుడు మబ్బుల వెనుక దాగిపోవడంతో, చెట్ల మధ్య చీకటి మరింత గాఢంగా మారింది.

ఆ అడవిలో ఒంటరిగా నడుస్తోంది మహారాణి.

రాజమహల్‌లో ఎప్పుడూ సేవకులు, సైనికులు మధ్య ఉండే ఆమె… ఇప్పుడు ఒక్కరే ఉంది.
ఆమె అడుగుల్లో అలసట కనిపిస్తున్నా, కళ్లలో మాత్రం ఓ విచిత్రమైన ధైర్యం ఉంది.
ఎక్కడికో చేరుకోవాలనే ఆత్రుత ఆమెను ముందుకు నడిపిస్తోంది.

ఒక్కసారిగా… vaadu vastunnadu? Maharani Rahasya Pranayam enduku?

ఎదురుగా ఉన్న పొదల్లో కదలిక వినిపించింది.

మహారాణి వెంటనే ఆగిపోయింది.
ఆమె చేతి సహజంగానే నడుముకు వెళ్లింది… కానీ ఖడ్గం అక్కడ లేదు.
అది గుర్తొచ్చిన క్షణం ఆమె ముఖంలో స్వల్ప ఆందోళన కనిపించింది.

“ఎవరు అక్కడ?”
ఆమె గంభీరంగా అడిగింది.

కొన్ని క్షణాలు నిశ్శబ్దం.

ఆ తర్వాత పొదల వెనుక నుంచి ఒక యువకుడు బయటకు వచ్చాడు.
సాధారణ వస్త్రాలు… భుజంపై చిన్న సంచి… చేతిలో కర్ర.
అతని ముఖంలో భయం లేదు, గౌరవం కూడా అతిగా లేదు.

“భయపడకండి,” అన్నాడు అతను ప్రశాంతంగా.
“నేను వేటగాడిని కాదు… దారి తప్పిపోయిన మనిషిని మాత్రమే.”

మహారాణి అతన్ని గమనించింది.
అతని మాటల్లో నటన కనిపించలేదు.

“ఈ అడవిలో రాత్రి ఒంటరిగా తిరగడం ప్రమాదమని తెలియదా?” అడిగాడు యువకుడు.

మహారాణి స్వల్పంగా నవ్వింది.

“తెలుసు… కానీ కొన్ని ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి, మరికొన్ని ప్రమాదాల్లోకి వెళ్లాల్సి వస్తుంది.”

ఆ మాట విన్న యువకుడు కొద్దిసేపు మౌనంగా ఆమెను చూశాడు.

“మీరు సాధారణ వ్యక్తిలా అనిపించడం లేదు,” అన్నాడు.

“అలా ఎందుకు అనిపించింది?”

“మీ మాటలు… మీ నడక… ముఖ్యంగా మీ కళ్లలో ఉన్న ఆదేశించే స్వభావం.”

మహారాణి ముఖంలో చిరునవ్వు మెరిసింది.

“అయితే నువ్వు మంచి పరిశీలకుడివి.”

గాలి ఒక్కసారిగా బలంగా వీచింది.
దూరంగా తోడేళ్ల అరుపులు వినిపించాయి.

యువకుడు ఆ దిశగా చూసి మెల్లగా అన్నాడు —
“ఇక్కడ నిలబడటం మంచిది కాదు. దగ్గరలో ఒక పాత ఆశ్రయం ఉంది. ఉదయం అయ్యే వరకు అక్కడ ఉండొచ్చు.”

మహారాణి కాసేపు ఆలోచించింది.

తెలియని వ్యక్తిని నమ్మడం ప్రమాదమే.
కానీ ఈ అడవిలో ఒంటరిగా ఉండటం ఇంకా ప్రమాదకరం.

“సరే,” అంది చివరకు.

యువకుడు ముందుగా నడవడం ప్రారంభించాడు.
మహారాణి అతని వెంట నడిచింది.

చెట్ల మధ్య సన్నని దారిలో ఇద్దరూ ముందుకు సాగుతుండగా…
మహారాణి దృష్టి ఒక్కసారిగా అతని మెడ వద్ద ఉన్న చిన్న లోహ చిహ్నంపై పడింది.

ఆ చిహ్నం చూసిన క్షణం…

ఆమె అడుగులు నెమ్మదించాయి.

ఎందుకంటే… vaadu vastunnadu? Maharani Rahasya Pranayam enduku?

అది రాజమహల్‌కు సంబంధించిన రహస్య గుర్తు.
ఆ గుర్తు సాధారణ మనిషి దగ్గర ఉండడం అసాధ్యం.

మహారాణి అతని వెంట నడుస్తూనే ఉంది.
అడవిలో చీకటి మరింత గాఢంగా మారుతున్నా… ఆమె మనసులో మాత్రం మరో ఆలోచన నడుస్తోంది.

ఈ యువకుడు ఎవరు?
అతని దగ్గర రాజమహల్ రహస్య గుర్తు ఎందుకు ఉంది?
ముఖ్యంగా… అతను నమ్మదగినవాడేనా?

కొంత దూరం నడిచాక ఇద్దరూ ఓ చిన్న ప్రవాహం దగ్గర ఆగారు.
నీటి శబ్దం మధ్య కాసేపు నిశ్శబ్దం అలుముకుంది.

మహారాణి మెల్లగా అతని వైపు చూసింది.

“ఒక విషయం అడగవచ్చా?” అని ఆదేశంగా అంది.

“అడగండి,” అన్నాడు యువకుడు ప్రశాంతంగా.

“అందం అంటే ఏమిటి?”

యువకుడు ఆమె ప్రశ్న విని స్వల్పంగా ఆశ్చర్యపోయాడు.

“అది సహజమే,” అన్నాడు.
“కానీ ఆకర్షణ ఒక్కటే మనిషి స్వభావాన్ని నిర్ణయించదు.”

“అయితే అందం మనిషిని బలహీనుడిని చేస్తుందా?”

యువకుడు చిరునవ్వు నవ్వాడు.

“కొంతమందిని చేస్తుంది.
కొంతమంది మాత్రం అందాన్ని చూసి మోహపడకుండా… ఆ మనిషి మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.”

మహారాణి అతని కళ్లలోకి నేరుగా చూసింది.

“అందమైన స్త్రీ ఒక పురుషుడిని పరీక్షించగలదా?”

“ఖచ్చితంగా,” అన్నాడు అతను.
“ఎందుకంటే మాటలతో చెప్పే గౌరవం కంటే… ప్రవర్తనలో కనిపించే నియంత్రణ నిజమైనది.”

ఆ సమాధానం విన్నాక మహారాణి కాసేపు మౌనంగా ఉంది.

ఆమె ఉద్దేశపూర్వకంగా సంభాషణను మరో దిశగా తీసుకెళ్లింది.

“రాజమహల్‌లో ఉన్న పురుషులు చాలా మంది… స్త్రీ అందాన్ని చూసి గొప్ప మాటలు చెబుతారు.
కానీ అవకాశం వస్తే స్వార్థం బయటపడుతుంది.”

యువకుడు నేలపై పడిన ఆకును ఎత్తుకుంటూ అన్నాడు —
“అందం మీద మోహం ఉండొచ్చు. అది తప్పు కాదు.
కానీ ఎదుటి మనిషిని ఒక వస్తువులా చూడటం తప్పు.”

“అయితే నువ్వు?”
మహారాణి స్వల్ప చిరునవ్వుతో అడిగింది.
“ఒక స్త్రీ తన జీవితంలో తోడుగా ఎవరిని ఎంచుకోవాలో ఎలా నిర్ణయించాలి అని అనుకుంటావు?”

యువకుడు ఆమె వైపు తిరిగి చూసాడు.

“ఆమె భయపడకుండా తన నిజస్వరూపంతో ఉండగలిగే వ్యక్తినే ఎంచుకోవాలి.”

ఆ మాటలు విన్న క్షణం మహారాణి ముఖంలో చిన్న మార్పు కనిపించింది.

ఎందుకంటే… vaadu vastunnadu? Maharani Rahasya Pranayam enduku?

ఆమె ఇప్పటివరకు కలిసిన చాలా మంది పురుషులు, ఆమె మహారాణి అని తెలుసుకున్న తర్వాత మాత్రమే గౌరవం చూపించారు.
కానీ ఈ యువకుడు మాత్రం ఆమె ఎవరో తెలియకుండానే, ఆమెను ఒక మనిషిలా మాట్లాడుతున్నాడు.

“నీ మాటలు చాలా భిన్నంగా ఉన్నాయి,” అంది ఆమె మెల్లగా.

యువకుడు నవ్వాడు.

“మీ ప్రశ్నలు కూడా సాధారణంగా లేవు.”

ఆకాశంలో మేఘాలు కదిలాయి.
చంద్రకాంతి మళ్లీ వారి ముఖాలపై పడింది. వెన్నెల వెలుగులో ఒకరికొకరు స్పష్టంగా కనబడుతున్నారు.

ఆ వెలుతురులో యువకుడు మొదటిసారి స్పష్టంగా మహారాణి ముఖాన్ని చూశాడు.

కొన్ని క్షణాలు అతను మౌనంగా నిలిచిపోయాడు.

అది గమనించిన మహారాణి మనసులో ఒక చిన్న నమ్మకం కలిగింది.

ఎందుకంటే ఆమెకు కావలసింది…
తన సింహాసనం కోసం దగ్గరయ్యే వాడు కాదు.

vaadu vastunnadu? Maharani Rahasya Pranayam enduku?
vaadu vastunnadu? Maharani Rahasya Pranayam enduku?

“ఈ రాజవంశం నిలబడానికి, భవిష్యత్తులో రాజ్యానికి రక్షకుడు కావాలి

కాబట్టి మనం ఓ పవిత్ర బంధం పెట్టుకుందాం

ఆ బంధమే బిడ్డకు రక్ష,

కాబట్టి మొహం లేకుండా

మనం ప్రేమగా మనస్పూర్తిగా

కలసి జీవించి

వాడు పుట్టాక మాత్రం నీకు నాకు బంధం లేదు..” అంది

“మరి వాడు ఎలా రాజు” అన్నాడు.

గొప్ప కార్యాలు సాధించేవారికి

ప్రకృతే తల్లి, తండ్రి…

మన బిడ్డకు అంతే,

కాబట్టి నీవు దాని గురించి చింతించకు” అంది…

వారు వాడి కోసం… ఒక్క మనసుతో ఒక్క మాటకు కట్టుబడ్డారు.

Aa alayamlo katha cheppakapote ఇక అంతే సంగతి కథాయలంలో కథలు

kathalayam: vanchanaku vanchane vastundi? ఆమె అతనితో ఆ రాత్రి?

Whatsapp lo kotta adbhuta feacher meekosam

https://cinemasandadi.com

https://telugureads.com

Leave a Comment