Yuvaraju viluva Oka Chellani Nanem

Yuvaraju viluva Oka Chellani Nanem ఎందుకు యువరాజు ఒక చెల్లని నాణేనికి వేలంలో అమ్ముడుపోయాడు? ఈ తెలుగు కథ చదవండి. ఆదిత్యవర్మ యువరాజు నిశ్చల స్వభావం గురించి…

Yuvaraju viluva Oka Chellani Nanem

రాజసింహాసనం ముందు ఉన్న ఆ సభామండపం ఆ రోజు విచిత్రమైన నిశ్శబ్దంతో నిండిపోయింది.
వందలాది దీపాలు వెలిగినా… ఆ వెలుగులో ఆనందం లేదు.
భయం ఉంది. అవమానం ఉంది.

సింహాసనంపై కూర్చున్నాడు మహారాజు వీరవిక్రముడు, చాలా కోపంగా ఉన్నాడు.
అతని కళ్లలో కోపం సభ అంతా కనబడుతుంది.

యువరాజు ఆదిత్యవర్మ చేతులకు సంకెళ్ళు వేసి, సభమధ్యలో నిలబెట్టబడ్డాడు.

అతడు ఆ రాజ్యానికే రాజకుమారుడే, అయినా.
కానీ ఆ క్షణంలో… ఒక నేరస్తుడిలా అక్కడ ఉన్నాడు.

“రాజ్యానికి కాబోయే యువరాజువి, నీవే సభ మధ్యలో నన్నే ఎదిరిస్తావా?” అంటూ గర్జించాడు మహారాజు.

ఆదిత్యవర్మ తలవంచలేదు.

“ధర్మం దగ్గర అధికారం కాదు, ఆచరణ కావాలి… ధర్మం విషయంలో నిజం చెప్పడం తిరుగుబాటు అయితే… నేను తిరుగుబాటుదారుడినే మహారాజా.” అన్నాడు

సభలో అందరూ ఉలిక్కిపడ్డారు.

మహారాజు వీరవిక్రముడు వికటాట్టహాసం చేసాడు.

“చాలు!
ఇప్పటి నుండి ఇతను ఇతరుడు,
ఇతడు రాజద్రోహిగా పరిగణిస్తున్నాను.
ఇవాళ సభ మధ్యలో బానిసగా వేలం వేయబడతాడు!”

అందరూ షాక్‌లో ఒకరినొకరు చూసుకున్నారు. వీరవిక్రముడు ప్రకటనతో

ప్రధాన మంత్రి నెమ్మదిగా లేచి అడిగాడు.

“మహారాజా… వేలం నియమం ఏమిటి?” అని అడిగాడు

మహారాజు చల్లగా నవ్వాడు.

“ఇది మామూలు వేలం కాదు, పుట్టుకతో గొప్పవాడు, ఎంత క్రిందకు దిగజారాడో నిర్ణయించే రోజు”

సభ మొత్తం మౌనమైంది.

“ఎవడు ఎక్కువ ధర చెబితే, వాడి తల తెగుద్ది
ఎవడు తక్కువ ధర చెబితే వాడికే వీడు బానిస.” అన్నాడు.

ఒక్కసారిగా సభలో గుసగుసలు మొదలయ్యాయి.

“ఏమిటది? యువరాజుని అమ్మడం ఏమిటి?”
“అది హీనంగా అతి తక్కువ ధరకు?”
“యువరాజుకి ఇదేమి కర్మ?”

మహారాజు కళ్లలో క్రూరమైన వెలుగు మెరిసింది.

“వాడి గర్వం విరగాలి
రాజ్యానికి తెలిసిపోవాలి… యువరాజు విలువ ఎంత తక్కువో.”

ఆదిత్యవర్మ మాత్రం నిశ్శబ్దంగా నిలబడ్డాడు.

వేలం ప్రారంభమైంది.

“పది వేల బంగారు నాణేలు!” అని ఓ సామంతుడు అరిచాడు.

“ఎనిమిది వేల నాణేలు!” ఇంకొకడు అన్నాడు.

“ఐదు వేల నాణేలు!”

“రెండు వేల నాణేలు!”

ధర తగ్గుతూనే ఉంది.

ప్రతి సంఖ్యతో సభలో నవ్వులు పెరిగాయి.
ప్రతి తగ్గింపు… యువరాజు గౌరవాన్ని కొరుకుతున్నట్టుంది.

కొంతసేపటికి…

“వంద నాణేలు!” అన్నాడు ఓ మద్యం వ్యాపారి.

సభ మొత్తం పెద్దగా నవ్వింది.

ఆదిత్యవర్మ కళ్లలో తొలిసారి అవమానపు నీరు మెరిపింది.

అప్పుడే…

సభ వెనుకనుండి ఓ మృదువైన స్త్రీ స్వరం వినిపించింది.

“పది నాణేలు. కాదు అయిదు నాణేలు కాదు కాదు ఒక్క చెల్లని నాణెం”  అన్నది.

అందరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశారు.

అక్కడ నిలబడి ఉంది ఒక స్త్రీ.

ఎర్రని వస్త్రాలు.
మెడ నిండా ముత్యాలు.
కళ్లలో విచిత్రమైన ప్రశాంతత.

ఆమె పేరు మృణాళిని.

Yuvaraju viluva Oka Chellani Nanem
Yuvaraju viluva Oka Chellani Nanem

రాజధానిలో ప్రసిద్ధ వేశ్య.

సభలో చాలామంది ఆమెను గుర్తించి చిరునవ్వులు నవ్వారు.

“వేశ్యా?”
“ఆమె యువరాజుని కొనాలా?”
“హా!”

మహారాజు కూడా ఆశ్చర్యపోయాడు.

“చెల్లని నాణేనికా”

మృణాళిని నెమ్మదిగా ముందుకొచ్చింది.

“అవును మహారాజా.”

“ఇంకా తక్కువకు ఎవరైనా పాడతారా? ఇది చెల్లదు” అని మంత్రి గట్టిగా అడిగాడు.

సభ నిశ్శబ్దమైంది.

ఎవరూ మాట్లాడలేదు.

అప్పుడు వీర విక్రముడు అహం తృప్తి చెంది,

“శభాష్… నా మాటకు తగ్గట్టుగా నీవు చెల్లని నాణెం ఇచ్చి ఇతడిని, ఇంకా లక్ష వరహాలు తీసుకుపో” అన్నాడు.

ఎందుకంటే…
ఒక యువరాజును కొనడం కంటే,
ఒక అవమానాన్ని ఇంటికి తీసుకెళ్లాలని ఎవరూ కోరుకోలేదు.

మంత్రి చేతిని పైకెత్తాడు.

“ఒక్క చెల్లని నాణెం… ఒకసారి…”

ఆదిత్యవర్మ కళ్లలో అగ్ని మండింది.

“రెండుసార్లు…”

మృణాళిని మాత్రం యువరాజునే చూస్తోంది.

ఆ చూపులో కామం లేదు.
జాలి లేదు.
ఏదో అర్థంకాని బాధ మాత్రమే ఉంది.

“మూడుసార్లు!
యువరాజు ఆదిత్యవర్మ… ఇక నుండి మృణాళిని అనే వేశ్యకు చెందిన బానిస!”

సభలో నవ్వులు మార్మోగాయి.

ఆదిత్యవర్మ తలను క్రిందికి వంచుకున్నాడు.

ఆ క్షణంలో…
ఒక రాజకుమారుడు చనిపోయాడు.

మిగిలింది…
ఒక వేశ్య చేత కొనబడిన చెల్లని నాణేనికి కొనబడిన బానిస మాత్రమే.

Yuvaraju viluva Oka Chellani Nanem
Yuvaraju viluva Oka Chellani Nanem

మృణాళిని ఇంటి వెనుక భాగంలో చిన్న మట్టిగది ఉంది.
అదే ఇప్పుడు ఆదిత్యవర్మకు ఆశ్రయం.

ఒకప్పుడు వెండి మంచాలపై నిద్రపోయిన యువరాజు…
ఇప్పుడు నేలపై పరచిన చిరిగిన దుప్పటిపై పడుకుంటున్నాడు.

మొదటి రాత్రే మృణాళిని అతడిని బయట గుమ్మం దగ్గర నిలబెట్టింది.

“ఏయ్ ఈరోజు నుండి, ప్రతిరాత్రి నువ్వు కాపలా.”

ఆదిత్యవర్మ ఆమె పలకరింపుకు ఆశ్చర్యంగా చూశాడు.

“సరేనని” అన్నాడు

“ఇంకా ప్రశ్నార్ధకంగా చూడకూడదు” అంది
“ఇక నుండి ప్రశ్నలు అడగకూడదు.”

ఆ మాట అతని గుండెలో గుచ్చుకుంది.

చలిగాలి బలంగా వీచింది.
రాత్రంతా అతడు గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడు.

లోపల మాత్రం సంగీతం, నవ్వులు, ధనవంతుల సంభాషణలు వినిపిస్తున్నాయి.

ప్రతి నవ్వు… అతనికి అవమానంలా అనిపించింది.

ఉదయం అవ్వగానే మృణాళిని తలుపు తెరిచింది.

“ఇంకా నిలబడి ఉన్నావా?
అలసిపోయానని చెప్పి పడుకోలేదు కదా?”

ఆమె స్వరంలో వ్యంగ్యం ఉంది.

తర్వాత రోజు నుంచి పనులు మొదలయ్యాయి.

నీళ్లు మోయడం…
మంట కోసం కట్టెలు తెచ్చడం…
ఆవరణ శుభ్రం చేయడం…
గుర్రాలకు మేత వేయడం…

చేతులు గట్టిపడ్డాయి.
కాళ్లు నొప్పితో మండిపోయాయి.

ఒకసారి అలసటతో నీళ్ల కుండ అతని చేతిలోంచి జారి పగిలిపోయింది.

మృణాళిని కోపంగా అతని దగ్గరకు వచ్చింది.

“రాజభవనంలో కూడా ఇంత పనికిరానివాడివేనా?”

ఆదిత్యవర్మ కోపంగా ఆమె వైపు చూడబోయి తమాయించుకున్నాడు.

“క్షమించండి”

ఆమె ఒక్కసారిగా నవ్వింది.

ఆ నవ్వులో ఎగతాళి ఉంది.

“కాదు.
నువ్వు ఇప్పుడు చెల్లని నాణేనికి బానిసవు.”

ఆ మాట అతని గర్వాన్ని మళ్లీ గాయపరిచింది.

కొన్ని రోజులు గడిచాయి.

మృణాళిని అతడిని నిజంగానే కఠినంగా చూసేది.
చిన్న తప్పు చేసినా తిడేది.

“నెమ్మదిగా పని చేస్తావు.”
“అది ఎక్కువ, ఇది తక్కువ, ఏది లేదు.”
“గర్వం ఇంకా తగ్గలేదు.”

అయినా ఆదిత్యవర్మ ఒక విషయం గమనించాడు.

రాత్రివేళ అతడు కాపలా కాస్తుంటే…
ఆమె గదిలో దీపం చాలా సేపు వెలిగేది.

ఒక రాత్రి వర్షం బలంగా పడింది.

చలితో అతని చేతులు వణికిపోయాయి.

అప్పుడే తలుపు నెమ్మదిగా తెరుచుకుంది.

మృణాళిని బయటకు వచ్చింది.
ఏమీ మాట్లాడకుండా అతని పక్కన ఒక దుప్పటి పెట్టింది.

“జలుబు వస్తే రేపు పని చేయలేవు,” అంది చల్లగా.

ఆమె తిరిగి లోపలికి వెళ్లిపోయింది.

ఆదిత్యవర్మ ఆశ్చర్యంగా ఆ దుప్పటిని చూశాడు.

ఆమె మాటల్లో కఠినత ఉంది.
కానీ… ఆ క్షణంలో ఆమె కళ్లలో మాత్రం వేరే భావం కనిపించింది.

ఆ రాత్రి మొదటిసారి అతనికి ఒక సందేహం వచ్చింది.

“నన్ను అవమానించడానికే కొనుక్కుందా?
లేక… ఇంకేదైనా కారణముందా?”

ఒకరోజు విటులు ఎవరు రాలేదు. వేశ్య యువరాజుని గదిలోకి రమ్మని అతడిని శృంగారానికి పిలుస్తుంది. అతడు ఒప్పోకోపోవడంతో అతడిని నానా మాటలు అంటుంది… శృంగార భాషలో కూడా నిందచేస్తుంది.

ఆ రోజు సాయంత్రం విచిత్రంగా నిశ్శబ్దంగా మారింది.

సాధారణంగా మృణాళిని ఇంటి ముందు రథాలు ఆగుతుంటాయి.
వీణ స్వరాలు వినిపిస్తాయి.
మద్యం వాసన గాలిలో తేలుతుంది.

కానీ ఆ రాత్రి…

ఎవరూ రాలేదు.

వాన పడబోతున్నట్టు ఆకాశం నీలి చీకటితో నిండిపోయింది.
ఇంటి అంతా వెలిగిన దీపాలు కూడా ఒంటరితనంగా కనిపించాయి.

ఆదిత్యవర్మ బయట ఆవరణలో కట్టెలు పేర్చుతున్నాడు.

అప్పుడే లోపల నుంచి మృణాళిని స్వరం వినిపించింది.

Yuvaraju viluva Oka Chellani Nanem
Yuvaraju viluva Oka Chellani Nanem

“ఏయ్… లోపలికి రా.” అంది

అతడు ఆశ్చర్యపోయాడు.

ఎప్పుడూ ఆజ్ఞలాగా మాట్లాడే ఆమె స్వరంలో ఆ రోజు వింతగా అలసట ఉంది.

అతడు గదిలోకి అడుగుపెట్టాడు.

అక్కడ సుగంధద్రవ్యాల వాసన తేలుతోంది.
దీపాల వెలుతురులో మృణాళిని కిటికీ పక్కన కూర్చుంది.

ఆమె అతని వైపు చూసింది.

“ఈ రోజు ఎవరూ రాలేదు, నువ్వు రా…” అని పిలిచింది

ఆదిత్యవర్మ మౌనంగా నిలబడ్డాడు.

కొన్ని క్షణాల తర్వాత ఆమె నేరుగా చెప్పింది.

“ఈ రాత్రి నువ్వు నా పక్కలో పడుకో ఉండు.”

అతడు ఒక్కసారిగా అర్థం చేసుకున్నాడు.

వెంటనే వెనక్కి అడుగు వేసాడు.

మృణాళిని కనుబొమ్మలు ముడిచింది.

“ఏయ్, రా” అని గట్టిగా

“నేను బానిసను, వస్తాను కానీ ఏమి చేయను” అన్నాడు

ఆమె చల్లగా నవ్వింది.

“బొమ్మ వలె ఉంటా”

ఆ మాట విన్న మృణాళిని ముఖం ఒక్కసారిగా మారిపోయింది.

ఇన్నాళ్లు దాచుకున్న కోపం బయటకొచ్చినట్టు ఆమె లేచింది.

“ఎదురు చెబుతావా?” అంటూ దగ్గరకు వచ్చింది.
“రాజసభలో నీ విలువ ఒక్క నాణెం కూడా కాదు, తెలుసు కదా”

ఆదిత్యవర్మ మౌనంగా నిలబడ్డాడు.

ఆమె మాటలు ఇంకా కఠినమయ్యాయి.

“పగలంతా నా ఇంట్లో పని చేస్తావు.
ఇప్పుడు నా ఒంటి పని చేయి.
నా తలుపులు కాపలా కాస్తావు.
నా అందానికి నీ చేతులను తలుపులుగా చేయి?”

అతని చేతులు బిగుసుకున్నాయి.

మృణాళిని కళ్లలో ఇప్పుడు బాధ, కోపం కలిసిపోయాయి.

“రాజకుమారుడివని ఇంకా అనుకుంటున్నావు.
కానీ ఈ నగరానికి నువ్వు ఇప్పుడు ఓడిపోయిన, విలువలేని మనిషివి మాత్రమే.”

ఆమె మాటలు కత్తిలా గుచ్చుకున్నాయి.

కొన్ని క్షణాలు గది నిశ్శబ్దంగా మారింది.

ఆమె కవ్వించింది, రెచ్చగొట్టి మాట్లాడింది, అయినా ఆదిత్య చలించకుండా ఉన్నాడు.

వాన చినుకులు కిటికీకి తగులుతున్న శబ్దం మాత్రమే వినిపిస్తోంది.

ఆదిత్యవర్మ నెమ్మదిగా తలెత్తి ఆమె వైపు చూశాడు.

ఆమె కళ్లలో మొదటిసారి అతడు ఇంకేదో చూశాడు.

కేవలం అవమానం కాదు.

ఒంటరితనం.
ఏళ్లుగా లోపల దాచుకున్న గాయం. కానీ ఆ క్షణంలో… వారిద్దరి మధ్య మాటల కంటే పెద్ద నిశ్శబ్దం నిలిచిపోయింది.

కథాలయంkathalayamలో ఈ కథ evaru చెప్పబోతున్నారు… ఈ కథ kathalayamలో చెప్పబడుతుండా?

rudrasenudu musalivadila maroka yuvatito

Rudrasenudu Yuvarani Mani Katha

Atani rachanaloni ame atanito aa ratri

https://cinemasandadi.com

https://techsangati.com

Leave a Comment