cheekatilo vinipinchina okka mata katha cheppu కథలు కాలక్షేపం కోసం అయితే, కథ చెప్పకపోతే కుదరదు అంటే పిచ్చి…. కానీ కథాలయం: చీకటిలో వినిపించిన ఆ ఒక్క మాట “కథ చెప్పు…” ఈ కథలో వెళ్తే
cheekatilo vinipinchina okka mata katha cheppu
వర్షం పడబోతున్నట్టుగా ఆకాశం నీలిరంగు చీకటితో కప్పుకుంది. గాలి తడిగా ఉంది. దూరంగా ఎక్కడో పాత చెట్టు కొమ్మలు ఒకదానికొకటి రాస్తూ “కిర్… కిర్…” అనే శబ్దం చేస్తుంటే, ఆ శబ్దం మధ్య మధ్యలో వినిపిస్తున్న కుక్కల అరుపులు ఆ రాత్రిని ఇంకా విచిత్రంగా మార్చేశాయి.
గ్రామానికి దూరంగా, ఒక పాత ఇల్లు. పైకప్పు మూలల్లో సాలీడు గూళ్లు. గోడల మీద పగుళ్లు. ఒక మూలలో వేలాడుతున్న పసుపు రంగు బల్బు అప్పుడప్పుడు వెలిగి, అప్పుడప్పుడు మసకబారుతూ ఉంది. ఆ వెలుతురు గదిని పూర్తిగా చూపించదు… కేవలం కొంత భాగాన్ని మాత్రమే చూపిస్తుంది. మిగిలిన చోట్ల చీకటి మెల్లగా ఊపిరి తీసుకుంటున్నట్టుగా ఉంది.
ఆ గదిలో నాలుగు యువకులు కూర్చున్నారు.
వారి పేర్లు అర్జున్, విక్రమ్, కార్తిక్, మనోజ్.
వాళ్ల ముందు గ్లాసులు సగం ఖాళి అయ్యాయి. కానీ వాళ్ల చర్చ మాత్రం నడుస్తుంది. మనిషి ఖాళీగా ఉంటే, ఎదో యోచన వస్తుంది… అదే నలుగురితో ఉంటే, వద్దనుకునే విషయాలే చర్చకు వస్తాయి… మొదట్లో తేలికగా తీసుకుని, తర్వాత దాని గురించి ఆలోచించడం సహజం… అలా వారి మధ్యలోకి ఒక చర్చ మొదలైంది.
“అరే… అదేదో ఒక ఆలయం ఉందట, ఎక్కడో చదివాను” అంటూ అర్జున్ దాని గురించి గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ చేతితో తలను మెల్లగా గుద్దుకుంటున్నాడు…
“అః గుర్తొచ్చింది… ఎదో ఒక పాత చినిగిపోయిన పేపర్, అది ఎదో పుస్తకంలో నుండి చింపినట్టు ఉంది, అందులోనే దాని గురించి చదివాను,” అని అర్జున్ మెల్లగా మొదలుపెట్టాడు.
అతను మాట్లాడేటప్పుడు బయట గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. కిటికీ అద్దం స్వల్పంగా కంపించింది.
“ఏంట్రా బాబు… చిరిగి పోయిన పేపర్ కథ ఏమిటి?” అంటూ వ్యంగ్యంగా నవ్వాడు.
అర్జున్ కొంచెం అతని దగ్గరగావాలి, గళం తగ్గించాడు.
“ఒరేయ్ మాములుగా ఆలయం అంటే అందులో ఎదో దేవతా లేదా దేవుడు విగ్రహం ఉంటుంది కదా! కానీ అందులో కేవలం ఖాళీ సింహాసనం మాత్రమే ఉంటుందట…”
అంతే.
ఆ మాట విన్న వెంటనే విక్రమ్ చిరునవ్వు నవ్వాడు.
“ఓయ్… పాత ఆలయాల కథలు చెప్పకు రా.” అన్నాడు.
మనోజ్ మాత్రం నిశ్శబ్దంగా ఉన్నాడు. అతని కళ్ళు గదిలోని చీకటి మూలల మీదే ఉన్నాయి. ఎందుకో అతనికి ఆ మాట వినగానే గుండెలో చిన్న చలి పుట్టింది.
అర్జున్ మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టాడు.
“ఎక్కడైనా దేవతకు లేదా దేవుడుకు పూజ చేస్తాం, కానీ అక్కడ కథ చెప్పాలి”
అనగానే కార్తీక్ “కాదురా కథల గోల ఏమిటి రా, ఒదిలెయ్” అన్నాడు.
“అది కాదురా… ఒకతను కూడా ఇలాగే ఆ ఆలయం గురించి చదివాడట. అదే రాత్రి అతనికి ఒక కల వచ్చింది.”
బయట ఒక్కసారిగా మెరుపు మెరిసింది.
గది మొత్తం క్షణం పాటు తెల్లగా వెలిగింది.
ఆ క్షణంలో… వాళ్లందరికీ గదిలో ఇంకెవరో నిలబడి ఉన్నట్టుగా అనిపించింది.
కానీ వెంటనే మళ్లీ చీకటి.
“ఏ కల?” అని మనోజ్ నెమ్మదిగా అడిగాడు.
అర్జున్ గళం మరింత మసకబారింది.
“ఆ కలలో… అతను ఒక పొడవాటి అడవిలో నడుస్తున్నట్టుగా కనిపించిందట. ఆ అడవిలో గాలి కూడా శబ్దం చేయదట. చెట్లు కదలవు. పక్షులు అరవవు. తన అడుగుల శబ్దమే మాత్రమే వినిపిస్తుందట. అక్కడికి అతను వెళ్లినట్టు”
ఆ నలుగురి ఊహల్లో ఆ అడవి స్పష్టంగా రూపం దాల్చింది.
చీకటితో నిండిన పొడవాటి దారి… cheekatilo vinipinchina okka mata katha cheppu
చెట్ల మధ్య పొగమంచు…
దూరంగా ఎక్కడో ఒక ఆలయం ఆకారం…
“ఆ ఆలయం దగ్గరకు వెళ్లగానే,” అర్జున్ మెల్లగా అన్నాడు, “అక్కడ దేవుడు ఉండడట లేదు. కేవలం ఒక పెద్ద నల్లటి సింహాసనం మాత్రమే ఉంటుందట.”
విక్రమ్ నవ్వబోయాడు.
కానీ ఎందుకో అతని గొంతులో నవ్వు ఆగిపోయింది.
“అతను మరుసటి రోజు తన ఫ్రెండ్స్‌కి ఆ కల గురించి చెప్పాడట. వాళ్లు నవ్వేశారు. ‘నీ భ్రమ’ అన్నారు.”
గదిలో బల్బు ఒక్కసారిగా మసకబారింది.
“అంతా పడుకున్నారు…”
గదిలో నిశ్శబ్దం పెరిగింది.
“కానీ మరుసటి రోజు…”
అర్జున్ కాసేపు ఆగాడు.
వాళ్లందరూ అతని వైపే చూస్తున్నారు.
“గదికి లోపల నుంచి గడియ పెట్టినట్టే ఉంది.”
విక్రమ్ చేతిలో ఉన్న గ్లాస్ నెమ్మదిగా టేబుల్ మీద పెట్టాడు.
“అయితే?”
అర్జున్ కళ్ళు నేరుగా వాళ్ల కళ్ళలోకి చూశాయి.
“ఆ కలగన్న వాడు మాత్రం గదిలో లేడు.”
బయట గాలి బలంగా వీచింది.
కిటికీ తలుపు “ధమ్!” అని కొట్టుకుంది.
మనోజ్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసాడు.
ఎవరూ లేరు.
కానీ… ఎవరో విన్నట్టుగా అనిపించింది.
కొన్ని క్షణాలు ఎవరూ మాట్లాడలేదు.
ఆ నిశ్శబ్దం మధ్య కార్తిక్ బలవంతంగా నవ్వాడు.
“ఒరేయ్… ఇలా అయితే ఇప్పుడు మనలో ఒకరికి కల వస్తుందా?”
ఆ ప్రశ్న వినగానే గదిలోని గాలి మారిపోయినట్టుగా అనిపించింది.
అర్జున్ కిటికీ బయట చీకటిని చూస్తూ అన్నాడు—
“ఏమో తెలియదు…”
అతని స్వరం చాలా నెమ్మదిగా ఉంది.
“అప్పుడు ఏం జరిగిందో… ఇప్పుడు ఏం జరుగుతుందో…”
ఆ గదిలోని బల్బు ఒక్కసారిగా ఆరిపోయింది.
పూర్తి చీకటి.
వాళ్లకు ఇప్పుడు ఒకరి ఊపిరి ఇంకొకరికి వినిపిస్తోంది.
దూరంగా… ఎక్కడో…
ఒక గంట మోగిన శబ్దం.
“టంగ్…”
ఆ శబ్దం ఎక్కడి నుంచో కాదు…
చాలా దూరంలోని ఒక ఆలయం నుంచే వచ్చినట్టుగా అనిపించింది.
అర్జున్ చీకట్లోనే చివరి మాట చెప్పాడు.
“ఆ ఆలయంలో దేవత ఉండదు…” cheekatilo vinipinchina okka mata katha cheppu అంతే…
మరోసారి గంట శబ్దం.
“టంగ్…”
“కానీ అక్కడికి వెళ్లినవాడు… ఒక కథ చెప్పాలి.”
విక్రమ్ గొంతు ఎండిపోయింది.
“చెప్పకపోతే?”
కొన్ని క్షణాలు ఎలాంటి శబ్దం లేదు.
ఆ తర్వాత…
చీకట్లో ఎవరో ఐదో వ్యక్తి కూర్చున్నట్టుగా అనిపించింది.
అర్జున్ మెల్లగా అన్నాడు—
“లేకపోతే… ఆ ఖాళీ సింహాసనం ఎప్పటికీ ఖాళీగా ఉండదు…”
ఆ రాత్రి మరింత లోతుగా మారింది.
గడియారం రెండు దాటింది.
బయట వర్షం ఇంకా మొదలుకాలేదు… కానీ గాలిలో వాన వాసన గట్టిగా ఉంది. పాత ఇంటి పైకప్పు మీద చెట్టు కొమ్మలు రాస్తూ “కిర్… కిర్…” అనే శబ్దం చేస్తున్నాయి. గదిలోని బల్బు ఇప్పుడు పూర్తిగా ఆరిపోయింది. కేవలం కిటికీ గుండా వస్తున్న వెన్నెల మాత్రమే గదిని కొద్దిగా కనిపించేలా చేస్తోంది.
నలుగురు పడుకున్నారు.
కానీ వాళ్లలో ఎవరికీ నిజంగా నిద్ర పట్టలేదు.
ఆ ఆలయం గురించి మాట్లాడిన తర్వాత గదిలో ఏదో కనిపించని ఒత్తిడి ఏర్పడింది. గాలి కూడా భారంగా మారింది.
అప్పుడే…
విక్రమ్ ఫోన్ ఒక్కసారిగా మోగింది.
ఆ శబ్దం ఆ నిశ్శబ్దంలో చాలా ఘోరంగా వినిపించింది.
విక్రమ్ ఒక్కసారిగా కళ్లు తెరిచాడు.
ఫోన్ స్క్రీన్ వెలుగు అతని ముఖంపై పడింది. స్క్రీన్ మీద నంబర్ లేదు. కేవలం “Unknown” మాత్రమే కనిపించింది.
అతను కాసేపు ఆలోచించాడు.
తర్వాత నెమ్మదిగా కాల్ లిఫ్ట్ చేశాడు.
“హలో…” అన్నాడు.
కొన్ని క్షణాలు ఎలాంటి శబ్దం లేదు.
ఆ తర్వాత…
అవతల నుండి ఒక హస్కీ గొంతు.
చాలా లోతుగా… గాలిలోంచి వస్తున్నట్టుగా…
“మరిచిపోయావా…”
ఆ మాట వినగానే విక్రమ్ ముఖం మారిపోయింది.
అతని కళ్లలో భయం లేదు.
అయితే… విచిత్రమైన పరిచయం ఉంది.
అతను తెలియకుండానే నెమ్మదిగా అన్నాడు—
“నిన్ను మరిచిపోవడం అంటే… నేను లేనట్టే…”
ఆ మాట బయటకు వచ్చాక విక్రమ్‌కి తానే ఆశ్చర్యపోయాడు.
ఎందుకంటే—
ఆ మాటలు అతను ఆలోచించి చెప్పలేదు.
అవి ఎవరో తనలోంచి మాట్లాడించినట్టుగా అనిపించింది.
అవతలి గొంతు మెల్లగా నవ్వింది.
ఆ నవ్వు మనిషి నవ్వులా లేదు.
చాలా పాత గదిలో ప్రతిధ్వనించినట్టుగా ఉంది.
తర్వాత ఒక్క మాట మాత్రమే వినిపించింది.
“అయితే… రా…”
కాల్ కట్ అయిపోయింది. కాని మిగిలిన మాట cheekatilo vinipinchina okka mata katha cheppu
విక్రమ్ కొద్దిసేపు ఫోన్ వైపు చూసాడు.
అతని గుండె బలంగా కొట్టుకుంటోంది.
కానీ అతని మనసు మాత్రం వేరే చోటుంది.
ఎక్కడికో వెళ్లాలి…
ఎవరో పిలుస్తున్నారు…
ఎవరో ఎదురుచూస్తున్నారు…
అతను మెల్లగా లేచాడు.
మిగిలిన వాళ్లు నిద్రలోనే ఉన్నారు.
విక్రమ్ ఎలాంటి శబ్దం చేయకుండా బయటకు నడిచాడు.
ఆ ఇంటి బయట అతని బైక్ నిలబడి ఉంది.
గాలి ఇప్పుడు చల్లగా కాదు…
వింతగా చల్లగా ఉంది.
అతను బైక్ స్టార్ట్ చేశాడు.
“టక్… టక్… వ్రూమ్…”
ఇంజిన్ శబ్దం ఆ చీకటిలో కలిసిపోయింది.
విక్రమ్ రోడ్డుమీద బయలుదేరాడు.
మొదట్లో దారి తెలిసినట్టే అనిపించింది.
కానీ కొద్దిదూరం వెళ్లాక…
చుట్టూ కనిపిస్తున్న ప్రదేశాలు మారిపోయాయి.
గ్రామం లేదు.
ఇళ్లు లేవు.
రోడ్డు మీద ఒక్క లైట్ కూడా లేదు.
కేవలం అడవి.
బైక్ హెడ్‌లైట్ వెలుగు చెట్ల మధ్య పొడవాటి నీడలను వేస్తోంది.
విక్రమ్ గుండెల్లో ఇప్పుడు భయం మొదలైంది.
“నేను ఎక్కడికి వెళ్తున్నాను…?”
అతను బైక్ ఆపాడు.
వెంటనే ఫోన్ తీసి మ్యాప్ ఓపెన్ చేశాడు.
స్క్రీన్ మీద ఒకే ఒక లొకేషన్ కనిపించింది.
పేరు లేదు.
కేవలం ఒక ఎర్ర బొట్టు.
ఆ బొట్టు కింద ఒక మాట మాత్రమే ఉంది.
“చేరుకో…” cheekatilo vinipinchina okka mata katha cheppu
విక్రమ్ చేతులు చెమట పట్టాయి.
“ఇది ఎవరు చేస్తున్నారు…?”
అతను వెనక్కి తిరగాలని అనుకున్నాడు.
కానీ…
బైక్ తానే ముందుకు వెళ్లాలనుకుంటున్నట్టుగా అనిపించింది.
చివరికి అతను మళ్లీ స్టార్ట్ చేశాడు.
కొన్ని నిమిషాల తర్వాత…
మ్యాప్ ఒక్కసారిగా ఆగిపోయింది.
స్క్రీన్ మీద—
“You have reached your destination.”
అని కనిపించింది.
విక్రమ్ నెమ్మదిగా తలెత్తి చూశాడు.
అక్కడ…
అది ఉంది.
ఆలయం.
చాలా పాతది.
నల్లటి రాళ్లతో నిర్మించబడింది.
దాని మీద చెట్లు పెరిగిపోయాయి.
గాలి అక్కడికి రాగానే శబ్దం చేయడం మానేసింది.
ఆలయం ముందు భారీ తలుపు సగం తెరిచి ఉంది.
అందులోంచి చీకటి మాత్రమే కనిపిస్తోంది.
విక్రమ్ గొంతు ఎండిపోయింది.
“ఇది… నిజమా…”
అతను వెనక్కి తిరగాలని ప్రయత్నించాడు.
అప్పుడే—
లోపల నుండి ఒక గొంతు. cheekatilo vinipinchina okka mata katha cheppu
“కథ చెప్పు…”
విక్రమ్ ఒక్కసారిగా గడ్డకట్టిపోయాడు.
“ఎ… ఎవరు?”
“కథ చెప్పు…”
ఈసారి ఆ గొంతు మరింత దగ్గరగా వినిపించింది.
విక్రమ్ వెనక్కి అడుగు వేసాడు.
“నేను రాను… నాకు ఇవేం అవసరం లేదు…”
అప్పుడే ఆలయం లోపల గాలి బలంగా వీచింది.
తలుపు పూర్తిగా తెరుచుకుంది.
చీకట్లో…
ఒక భారీ సింహాసనం కనిపించింది.
ఖాళీగా.
కానీ…
అది ఎవరో కూర్చున్నట్టుగా అనిపిస్తోంది.
“రాకపోతే…”
ఆ గొంతు ఇప్పుడు కోపంగా మారింది.
“సింహాసనం ఖాళీగా ఉండదు…”
విక్రమ్ గుండె వేగంగా కొట్టుకుంది.
అతను వెనక్కి పరుగెత్తబోయాడు.
అప్పుడే—
ఆ చీకట్లో ఎవరో అతని భుజాన్ని పట్టుకున్నట్టుగా అనిపించింది.
విక్రమ్ ఒక్కసారిగా భయంతో గట్టిగా అరిచాడు.
“అఅఅఅఽఽఽఽ!!”
“విక్రమ్!!”
అర్జున్ ఒక్కసారిగా లేచాడు.
మనోజ్, కార్తిక్ కూడా ఉలిక్కిపడి కూర్చున్నారు.
గదిలో ఇంకా అదే చీకటి.
విక్రమ్ చెమటలతో తడిసిపోయాడు.
అతని ఊపిరి ఆగిపోతున్నట్టుగా ఉంది.
“ఏమైంది రా?” అని కార్తిక్ అడిగాడు.
విక్రమ్ వణుకుతున్న చేతులతో నీళ్లు పట్టుకున్నాడు.
అతని పెదాలు ఇంకా కంపిస్తున్నాయి.
కొన్ని క్షణాలు తర్వాత…
అతను మెల్లగా అన్నాడు—
“నేను… అక్కడికి వెళ్లాను…”
ముగ్గురూ నిశ్శబ్దంగా అతని వైపు చూశారు.
“ఏ… ఎక్కడికి?”
విక్రమ్ కళ్ళు ఇంకా భయంతోనే ఉన్నాయి.
“కథాలయం…”
ఆ మాట వినగానే గదిలో గాలి ఒక్కసారిగా చల్లబడింది.
బయట దూరంగా…
ఒక గంట మళ్లీ మోగింది.
“టంగ్…”
ఒక్క మాట మాత్రం అతని చెవుల్లో గింగిరాలు తిరుగుతుంది. అదే cheekatilo vinipinchina okka mata katha cheppu